twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: ప్రభాస్ కు హైకోర్టు నోటీసులు.. ఆదిపురుష్ విడుదలను నిషేధించాలని పిటిషన్

    |

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టకున్న డార్లింగ్ ఫ్యాన్స్ టీజర్ రిలీజ్ తో ఊహించని విధంగా షాక్ అయ్యారు. ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన టీజర్ పై నెగెటివ్ కామెంట్స్ రావడమే కాకుండా వివాదస్పదం అవుతోంది. ఈ టీజర్ పై నెటిజన్లు మీమ్స్ తో ఆడుకుంటే.. రాజకీయ వేత్తలు సైతం విమర్శలు గుప్పించారు. ఆ సినిమాను బ్యాన్ చేయాలని ఏకంగా అయోధ్యలోని రామ మందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హీరో ప్రభాస్ తోపాటు ఆదిపురుష్ మూవీ యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

     నిరాశపరిచిన ఆదిపురుష్ టీజర్..

    నిరాశపరిచిన ఆదిపురుష్ టీజర్..

    దివంగత కష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. ఈశ్వర్ మూవీతో తెరంగేట్రం చేసిన డార్లింగ్.. బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటినుంచి చేసే ప్రతి మూవీని పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తూ అలరిస్తున్నాడు ఈ మిస్టర్ పర్ ఫెక్ట్. అయితే బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యామ్ అంతగా సక్సెస్ తేలేకపోయాయి. డార్లింగ్ తో సహా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఆదిపురుష్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా గురించి ఒక్క అప్ డేట్ వచ్చినా చాలు అని ఎంతో ఎదురుచూశారు. అంతలా ఎదురుచూసిన వారికి ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ ఎంతగానో నిరాశపరిచిన విషయం తెలిసిందే.

     ప్రభాస్ కు నోటీసులు..

    ప్రభాస్ కు నోటీసులు..

    ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ తోపాటు ఆదిపురుష్ చిత్రబృందానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం (అక్టోబర్ 10) నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసారని దాఖలైన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ టీజర్ లో ఓ వర్గం దేవుళ్లను తప్పుగా చూపారని న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ దాఖలు చేశారు. రాముడిని క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని, సాంప్రదాయ చిత్రపటానికి విరుద్ధంగా రాముడిని చూపించారని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. రావణుడి పాత్ర చాలా భయంకరంగా ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఆదిపురుష్ మూవీ విడుదలను నిషేధించేలా స్టే ఇవ్వాల్సిందిగా పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన ఢిల్లీ హైకోర్టు ఆదిపురుష్ మూవీకి నోటీసులు పంపించింది. పిటిషన్ దారుల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు నోటిసుల్లో పేర్కొంది.

    రాజకీయ నాయకుల విమర్శలు..

    రాజకీయ నాయకుల విమర్శలు..

    కాగా ఈ మూవీ జనవరి 12, 2023న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఆదిపురుష్ టీజర్ పై రాజకీయ వేత్తలు విమర్శలు గుప్పించారు. రామాయణంపై రీసెర్చ్ చేశారా.. రావణుడి పాత్రను అలా చిత్రీకరించడం ఏంటి, రావణుడు బ్రహ్మాణుడికి బదులు అల్లా ఉద్దీన్ ఖిల్జీలా ఉన్నాడంటూ బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సినిమాలోని హనుమాన్ పాత్రలో కనిపించిన దేవదత్త విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నారోత్తం మిశ్రా లేఖ రాసినట్లు చెప్పుకొచ్చాడు.

    లెదర్ దుస్తులు వేసుకోవడమేంటి..

    లెదర్ దుస్తులు వేసుకోవడమేంటి..

    టీజర్ లో హనుమాన్ లెదర్ క్లాత్ వేసుకోవడం వంటి తదితర సీన్లు మత మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని డైరెక్టర్ ఓం రౌత్ ను కోరినట్లుగా ఆయన తెలియజేశారు. సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమే అని స్పష్టంగా తెలిపారు. అలాగే అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఏకంగా ఆదిపురుష్ మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా చేశారు. తమ మనోభావాలు కించపరిచేవిధంగా రాముడు, రావణుడు, హనుమాన్ పాత్రలు ఉన్నట్లు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

    English summary
    Pan India Star Prabhas And His Starrer Movie Adipurush Team Gets Notice From Delhi High Court By Lawyer Raj Gaurav Stay Petition.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X