»   » యంగ్ హీరో భార్య కి డెంగీ ఫీవర్

యంగ్ హీరో భార్య కి డెంగీ ఫీవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి : బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ ఖాన్‌ సతీమణి అవంతిక డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. అవంతిక మాలిక్‌ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు ధ్రువీకరించారని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. వారం క్రితమే జ్వరం వచ్చినప్పటికీ తాము వైరల్‌ ఫివర్‌గా భావించామని చెప్పారు.

Dengue strikes Imran Khan's wife Avantika

క్రిందటి నెలలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ సైతం డెంగ్యూ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరాడు. గత కొన్నిరోజులు నుంచి షూటింగ్ లో బిజీగా ఉన్న రణ్ వీర్ కు ఆకస్మికంగా జ్వరం ఎక్కువ కావడంతో టెస్టుల నిమిత్తం ముంబై ఆస్పత్రి వెళ్లాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో అతను షూటింగ్ కు కొన్ని రోజులు విరామం ప్రకటించక తప్పలేదు.

ప్రస్తుతం అతను 'గూండే' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర సన్నివేశాలను కలకత్తాకు అతి సమీపంలో ఉన్న దుర్గాపూర్ లో షూట్ చేస్తుండగా తొలుత రణ్ వీర్ కొంత అలసటకు లోనైయ్యాడు. అతనికి ఒంట్లో నలతగా ఉన్నా కూడా సినిమా నిర్మాణానికి ఆటంకం కలగ కూడదనే ఉద్దేశంతో షూటింగ్ పాల్గొంటు వస్తున్నాడు. కాగా, జ్వరం కొద్దిగా ఎక్కువ కావడంతో ముంబైలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. పరీక్షలు నిర్వహించిన అనంతరం అతనికి డెంగ్యూ సోకినట్లు తేలింది. దీంతో రణ్ వీర్ ఎప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు అనే విషయంపై సందిగ్థత నెలకొంది.

English summary
It looks like dengue went calling on Imran Khan’s doors as well. The actor’s wife Avantika Malik has contracted the fever but is said to be stable. According to Imran, the intensity of the fever wasn’t too overwhelming, allowing Avantika to rest at their Bandra home instead of being rushed to the hospital.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu