twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనారెడీ' వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లేనా?

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : రోజు రోజుకీ ముదురుతున్న 'దేనికైనా రెడీ' వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు. టీవి 9 వారి చొరవతో వివాదం సమసిపోయే అవకాసం కనపడుతోంది. ఈ చర్చలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ద్రోణంరాజు రవికుమార్‌,రచయిత బి.వి.యస్ రవి కుమార్, దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఫైనల్ గా కొన్ని డిమాండ్స్ తో ఒప్పుకున్నారని తెలుస్తోంది. చర్చ లో చిరవగా ఈ వివాదానికి సామరస్య పూర్వకమైన ముగింపు ఇవ్వాలని చర్చని నిర్వహించిన రజనీకాంతో కోరటం జరిగింది.

    అప్పుడు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ద్రోణంరాజు రవికుమార్‌ మాట్లాడుతూ మూడు డిమాండ్స్ పెట్టారు. మొదటిది...సినిమాను తమ బ్రాహ్మణ కుల పెద్దలైన పది మందికి చూపి,వారు చెప్పిన కట్స్ తొలిగించాలి అన్నారు. అలాగే మోహన్ బాబు అనుచరుల చేతిలో కర్ర దెబ్బలు తిన్న వారిని మోహన్ బాబు వెళ్లి పరామర్శించాలి అన్నారు. మూడవది..మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి అన్నారు. మొదటి రెండింటికీ మంచు విష్ణు ఒప్పుకున్నారని అప్పుడే తెలియచేసారు. అయితే బహిరంగ క్షమాపణ చెప్పినప్పుడే ఈ వివాదం ముగుస్తుందని ద్రోణంరాజు రవికుమార్‌ తేల్చి చెప్పారు.

    మరో ఛానెల్ లో చిత్ర మరో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ...చిత్రం వివాదం ఓ కొలిక్కి వచ్చిందని, బ్రాహ్మణ సంఘం చెప్పిన పదిమందికి సినిమాని చూపుతామని అన్నారు. అలాగే చిత్రం రచయితలమైన కోన వెంకట్,బివియస్ రవి ఇద్దరూ తాము బ్రాహ్మణములమే అని అన్నారు. కోన వెంకట్..తమ పొట్ట కొట్టవద్దని అన్నారు. దానకి మీ బ్రతుకు తెరువు కోసం ఎనభై లక్షల మంది బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బ తీయటం సమంజసం కాదని బ్రాహ్మణ సంఘాలు అన్నాయి.

    ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం వివాదం జరుగినప్పుడు వెంటనే స్పందించి కట్స్ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ చిత్రం విషయంలో ఎందుకుని ముందుకు రావటం లేదని అడిగాయి. అలాగే మోహన్ బాబు...సెన్సార్ వారిపై ఒత్తిడి తెచ్చి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని అన్నారు. సెన్సార్ వారు చెప్పిన కట్స్ ఇప్పుడు వివాదం అవుతున్నాయని అప్పుడే తొలిగించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని అన్నారు. అయితే దర్శకుడు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ... తమ చిత్రం కర్ణాటక,ముంబై, కేరళలలో విడుదల అయ్యిందని, అక్కడ ఎదురుగాని అసభ్యకరమైన సన్నివేశాలు ఇక్కడ బ్రాహ్మణులుకు ఎలా కన్పించాయని అన్నారు.

    English summary
    Denikaina Ready Controversy Continues it is surrounded with controversies from the Brahmin organizations. But TV Channels say it will be closed soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X