»   » 'దేనికైనా రెడీ' కి బెంగుళూరు లోనూ సెగ

'దేనికైనా రెడీ' కి బెంగుళూరు లోనూ సెగ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు : మంచు విష్ణు హీరోగా చేసిన 'దేనికైనా రెడీ' వివాదం రాష్ట్రాలు దాటుతోంది. తాజాగా బ్రాహ్మణుల్ని కించపరచిన దృశ్యాలున్న 'దేనికైనా రెడీ' తెలుగు సినిమా ప్రదర్శనల్ని కర్ణాటకలో రద్దు చేయాలి' అని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ డిమాండ్‌ చేసింది. మహాసభ అధ్యక్షుడు బిఎస్‌వి సుబ్రమణ్య ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాలోని వివిధ సన్నివేశాలు, సంభాషణల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసభ్యంగా చిత్రీకరించారని విమర్శించారు.

  ఇక హైదరాబాద్ లోనూ ఆదివారం ఈ చిత్రం ప్రదర్శన ఆపాలంటూ నిరసనలు జరిగాయి. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించిన 'దేనికైనా రెడీ' సినిమాను వెంటనే నిషేధించాలని, బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్న దర్శక, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు భారతీయ బ్రాహ్మణ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు బ్రాహ్మణ సంఘాలు పాల్గొని నిరసన తెలిపాయి. ధన్వంతరి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కమలాకర్‌ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్‌ శర్మలు ముఖ్యఅతిథులుగా మాట్లాడారు.

  హిందూ ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణులపై అభ్యంతకర సన్నివేశాలతో సినిమాలు చిత్రీకరిస్తూ కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.దేనికైనా రెడీ చిత్ర నిర్మాత మోహన్‌బాబు, బ్రాహ్మణులపై దాడికి ప్రోత్సహించిన సీనినటుడు మంచు విష్ణులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. బ్రాహ్మణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మోహన్‌బాబు వెంటనే బ్రాహ్మణులకు బహిరంగ క్షమాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

  మరో ప్రక్క బ్రాహ్మణులను కించపరిచేలా నిర్మించిన 'ది ఉమెన్ ఇన్ బ్రాహ్మనిజం', 'దేనికైనా రెడీ' చిత్రాలను నిషేధించాలని తెలంగాణ అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గంగు ఉపేంవూదశర్మ డిమాండ్ చేశారు. దేనికైనా రెడీ చిత్ర నిర్మాత మంచు మోహన్‌బాబు, నటు డు విష్ణుపై క్రిమినల్ కేసు నమోదు చేసి భవిష్యత్‌లో మరెవ్వరూ ఇలాంటి చిత్రాలు నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం వివాదం జరుగినప్పుడు వెంటనే స్పందించి కట్స్ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఈ చిత్రం విషయంలో ఎందుకుని ముందుకు రావటం లేదని అడిగాయి. అలాగే మోహన్ బాబు...సెన్సార్ వారిపై ఒత్తిడి తెచ్చి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని అన్నారు. సెన్సార్ వారు చెప్పిన కట్స్ ఇప్పుడు వివాదం అవుతున్నాయని అప్పుడే తొలిగించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని అన్నారు.

  English summary
  Telugu movie ‘Denikaina Ready’ starring Manchu Vishnu and Hansika has come under fire from various Brahmin organisations and associations in Bangalore. The associations, on Sunday, registered their protests alleging that the film contains some scenes that hurt the sentiments of the community. At a press conference, Brahmana Seva Samithi demanded an apology from the director and producer of the film for portraying Brahmins in bad light.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more