నిర్మాతగా మారుతున్న 'దేనికైనా రెడీ' రచయిత
హైదరాబాద్ : వివాదాల్లో ఇరుకున్న 'దేనికైనా రెడీ' , 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాలకు రచయితగా పనిచేసిన బి.వియస్ రవి నిర్మాతగా మారుతున్నారు. ఆ చిత్రం టైటిల్ పేరు 'సెకండ్‌హ్యాండ్'. తన స్నేహితుడు పూర్ణ తో కలిసి ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ సెటైర్ అని చెప్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిషోర్ తుమ్మల దర్శకుడుగా మారుతున్నారు.
ఇక బివియస్ రవి గత కొంతకాలంగా పూరీ జగన్నాధ్ వద్ద రచయితగా పనిచేస్తున్నారు. ఆయన దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి కూడా రవి పని చేసారు. అలాగే గతంలో రవి దర్శకుడుగా మారి గోపీచంద్ హీరోగా వాంటెడ్ చిత్రం రూపొందించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న గౌరవం చిత్రానికి రైటర్ గా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మరో చిత్రం డైరక్షన్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
సెకండ్ హ్యాండ్ చిత్రం విషయానికి వస్తే...లో బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అశోశియేట్ గా పనిచేసిన రవి చంద్ర అందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ భూత్ రిటర్న్స్, అబ్ తక్ చప్పన్ 2 చిత్రాల కెమెరామెన్ అవనీంద్ర ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పూరి చిత్రాలకు ఎడిటర్ గా చేసే ఎస్.ఆర్ శేఖర్ ఈ చిత్రానికి ఎడిటర్ గా చేస్తున్నారు. కొత్త తరహా కాన్సెప్టు తో రూపొందే ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.


Click it and Unblock the Notifications











