twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'డిపార్టమెంట్ ' చిత్రం రూమర్స్ పై వర్మ ఖండన

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం డిపార్టమెంట్ గురించి ట్వీట్ చేసారు. ఆ చిత్రం ముంబై పోలీసు వ్యవస్దపై చిత్రం అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఆ ట్వీట్ లో...ప్రెస్ లో కొందరు డిపార్టమెంట్ చిత్రం ముంబై పోలీసుల రియల్ లైఫ్ కి చెందిందని అంటున్నారు. అది నిజం కాదు అన్నారు. అలాగే ఈ చిత్రం ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ లుకు చెందిన సినిమా అని అన్నారు.

    ముంబైలోని మాఫియాని ఎలిమినేట్ చేయటానికి ఏర్పాటైన ఏంటి టెర్రరిస్టు స్క్వాడ్ గురించి..ఆ క్రమంలో పోలీస్ డిపార్టమెంట్ ఎదుర్కొనే స్ట్రగుల్స్ గురించి ఉంటుందని అన్నారు.ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ..గ్యాంగస్టర్ గా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర పేరు సర్జేరావు గైక్వాడ్. అలాగే దగ్గుపాటి రానా పోలీస్ అధికారిగా,సంజయ్ దత్ ఓ కీలకమైన రోల్ ని పోషిస్తున్నారు. మంచు లక్ష్మి..సంజయ్ దత్ కి భార్యగా కనిపించనుంది. డిపార్టమెంట్ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

    వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రానా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది.ఇక మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది.ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.

    డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది.దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు.అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు.విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.

    English summary
    Ram Gopal Varma has denied reports saying his forthcoming film "Department" is based on the real-life characters of the Mumbai police. "Some sections of the press reported 'Department' is based upon real life characters in Mumbai police...it's not true," tweeted. "Department" is set for May 18 release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X