twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ‘డిపార్ట్‌మెంట్’-గ్లాసెస్ లేకుండా 3డి ఎఫెక్ట్

    By Bojja Kumar
    |

    సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్‌మెంట్" సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్టా? ఫట్టా? అనే విషయం పక్కన పెడితే...ఓ విషయంలో మాత్రం ఈ సినిమా తెరపై అద్భుతాలు సృష్టించడం ఖాయమని, భావితరాల దర్శకులకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందనే వాదన వినిపిస్తోంది.

    ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను వర్మ ఇటీవల తన సన్నిహిత సినీ ప్రముఖులకు ముంబైలో ప్రత్యేకంగా ఓ షో వేయించి మరీ చూపించాడు. ఆ సీన్లను చూసి అంతా ఆశ్చర్య పోయారట. 3డి గ్లాసెస్ లేకుండానే ఆ సీన్లు 3డి ఫిల్మ్ చూసిన అనుభూతిని కలిగించడమే అందుకు కారణం.

    సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం...వివిధ రకాల కెమెరాలతో ప్రయోగాలు చేయించే వర్మ, ఇందులో కొన్ని సీన్లను ప్రత్యేక కెమెరాలతో వివిధ కోణాల్లో చిత్రీకరించడం ద్వారా 3డి ఎఫెక్టు వచ్చే విధంగా చేశాడట. మరి ఇందులో నిజం ఎంతో? ఆ ఎఫెక్టు ఎలా ఉందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

    English summary
    Ramgopal varm's Department movie will give you the experience of watching a 3D film without wearing glasses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X