వర్మ...ఆ సిఎం ఖర్మ

ఆయన తాజ్ పర్యటన తీరుపై విమర్శలు అన్ని చోట్ల నుండి భారీగా వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల దాడుల్లో ధ్వంసమైన హోటళ్ల సందర్శనకు వెళ్లినపుడు తోడుగా సినీ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మను, తన కుమారుడు, నటుడు అయిన రితీష్‌ను వెంటబెట్టుకుని ఓ పిక్నిక్‌కు వెళ్లినట్లుగా కనిపించారంటూ రాజకీయవర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.తాజ్ పరిశరాలు పరిశీలిస్తున్నపుడు ఆయన హావభావాల్లో ఎక్కడా విషాదఛాయలేమీ లేవని, సరదాగా చూడ్డానికి వచ్చినట్లుగా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. తాజ్‌తోను, ముంబైతోను సంబంధంలేని పల్లెల్లో కూడా ఈ సంఘటన నేపథ్యంలో విషాదఛాయలు అలముకుంటే, బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏమిటని ఓ వయోవృద్ధుడు నిలదీశారు. మరో ప్రక్క రాంగోపాల్ వర్మ ముంబై దాడుల నేపథ్యంలో సినిమా తీస్తారన్న వదంతులు గుప్పుమంటున్నాయి.
అయితే, తాను రితేష్ వెంట వెళ్లానని, ముఖ్యమంత్రి దేశ్ ముఖ్ తో తనకు పరిచయం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. రితేష్ వెంట వెళ్లడంలో తప్పేమిటని ఆయన అడిగారు. విలాసరావు తనను గుర్తు పడతారో లేదో కూడా తనకు తెలియదని ఆయన అన్నారు. ముంబయి ఉగ్రవాద దాడులపై సినిమా తీసే ఉద్దేశం తనకు లేదని వర్మ చెప్పారు. విలాసరావు వెంట తాను వెళ్లడం కేవలం యాదృచ్ఛికమేనని ఆయన అన్నారు. అయితే వర్మ ఆయనతో కలసి వెళ్ళకుండా ఉండాల్సిందని,దాంతో ఈ ఘటన వేరే రూపం దాల్చి ఆయన పదివికే ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











