»   »  'బాహుబలి' లో దేవకట్టా రాసిన డైలాగు ఇదే

'బాహుబలి' లో దేవకట్టా రాసిన డైలాగు ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా టైటిల్స్ లో దర్శకుడు దేవా కట్టకు థాంక్స్ చెబుతూ కూడా ఓ టైటిల్ వేయించాడు దర్శకుడు రాజమౌళి. దానికి కాణం ఈ సినిమా కోసం దేవా కట్ట కొన్ని డైలాగ్స్ రాసిచ్చారనే సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్‌లో ఫ్రభాస్ చెప్పే డైలాగులు ఈయనే రాసాడంటూ వార్తలు వచ్చాయి. ‘బాహుబలి' కోసం దేవా కట్ట కాంట్రిబ్యూషన్ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్ ఇస్తూ థాంక్స్ కార్డు వేయించాడు. దీనిపై దేవా కట్ట సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఇంతకీ దేవకట్టా రాసిన డైలాగు ఏమిటీ అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

"నాతో వచ్చేదెవరు...నాతో చచ్చేదెవరు...చావుని దాటుకుని నాతో బ్రతికేదెవరు !"

Dev Katta's inspirational dialogue in Baahubali

క్లైమాక్స్ లో తన సైనికులను ఉద్దేసించి ఇన్సిప్రేషన్ గా చెప్పే ఈ అద్బుతమైన డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రమ్యకృష్ణకు సైతం కొన్ని డైలాగులు ఆయన రాసారు.

దేవకట్టా ట్వీట్ చేస్తూ... ‘బాహుబలిలో వార్ సమయంలో ప్రభాస్ చెప్పే స్పీచులు కేవలం కొన్ని పదాలు మాత్రమే నేను రాసాను. రాజమౌళి సృష్టించిన బాహుబలి సముద్రంలో నేను చేసింది నీటి చుక్కంత మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్ కార్డు వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం' అంటూ దేవా కట్ట చెప్పుకొచ్చారు.

English summary
Deva katta worked for Baahubali Dialogues such as "Naatho Vacchedhevaru.. Naatho Chaachdevaru..Chaavuni Daatukuni Naatho Bratikedhevaru!" rendered by Prabhas.
Please Wait while comments are loading...