»   » దేవకట్టా నెక్ట్స్ చిత్రంకి హీరో దొరికాడు

దేవకట్టా నెక్ట్స్ చిత్రంకి హీరో దొరికాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్ : విభిన్న చిత్రాలతో ముందుకు వెళ్లాలని మొదట నుంచి ప్రయత్నిస్తున్న దేవకట్టా మరో చిత్రం తో ముందుకు రాబోతున్నారు. ఆయన చిత్రంలో హీరోగా గోపిచంద్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని దేవకట్టా స్వయంగా తెలియచేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించిన పూర్తి వివరాలు బయిటకు వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని అంటున్నారు.

దేవకట్టా మాట్లాడుతూ...'ఆటోనగర్‌ సూర్య' సినిమా తరవాత రెండు మూడు స్క్రిప్ట్‌లు రాసుకున్నా, ఈ సినిమాతో ఉన్న అటాచ్‌మెంట్‌ వల్ల వేరే ప్రాజెక్టులు చేయలేకపోయా. నిజానికి గోపీచంద్‌తో ఎప్పుడో సినిమా మొదలు కావాల్సి ఉంది. కానీ దానికి బయట రచయితను అనుకున్నాం. కథ ఎందుకో సరిగా కుదరలేదు. దాంతో నా సొంత కథతోనే ముందుకెళ్లాలని ఆగాం. 'ఆటోనగర్‌ సూర్య' విడుదలయ్యాక మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. ప్రస్థానంలో ఎలాంటి అంశాలను చూసి ప్రేక్షకులు నన్ను ఆదరించారో, ఇందులోనూ అలాంటి విషయాలనే ఇష్టపడుతున్నారు అన్నారు.

Deva Katta to direct Gopi Chand

ఎప్పటినుంచో ఊరిస్తున్న 'ఆటోనగర్ సూర్య' విడుదలైంది. దేవా కట్టాకు ఓ వర్గంలో ఉన్న క్రేజు,మాస్ లుక్ తో ఓపినింగ్స్ బాగానే వచ్చాయి. అయితే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అరకొర మార్కులు వేయించుకొంది. దానికితోడు సినిమాను ట్రిమ్ చేయడంతో కొంత నెగెటివ్ మార్కులే పడ్డాయి. ఫైనల్ గా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు దేవకట్టా మాత్రం ట్విట్టర్ లో ఓ చిత్రానికి ఓ రేంజిలో ప్రమోషన్ చేస్తూ హిట్ సినిమా అనిపించాలని తాపత్రయపడుతున్నారు. సినిమాకు యాక్చువల్ గా పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువే డబ్బులు వస్తాయని ఆయన చెప్తున్నారు.

దేవకట్టా ట్వీట్ చేస్తూ.... నా లెక్క ప్రకారం ఆటోనగర్ సూర్య చిత్రంపై పది నుంచి పదకొండు కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. మిగతాది అంతా ఆ సంస్ధ నుంచి వచ్చిన వేరే వాటి బర్డన్స్. మీరు మొదట ఆరు వారాల చిత్రం షేర్ ,శాటిలైట్, డబ్బింగ్ కలిపితే...20-30% వరకూ పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ వచ్చింది..ఇది నిజం అంటున్నారు.


ఇలా బడ్జెట్, వచ్చిన లాభాలు ఆయన ట్విట్టర్ లో రాస్తుంటే చదివిన వారు...అయ్యిండవచ్చు...అయితే నిజం తెలుసుకుని ఏం చేయాలి...అంటున్నారు. అయితే ఆయన టార్గెట్ ఇండస్ట్రీలో వ్యక్తులు కోసం అని, మరో చిత్రం నిర్మాత కోసమని మరికొందరు అంటున్నారు. చిత్రం డిజాస్టర్ అయ్యిందని, నిర్మాతలు నష్టపోయారని చెప్పుకుంటూంటే ఇలా ట్వీట్స్ ద్వారా ఆయన ఖండిస్తున్నారని చెప్తున్నారు.

English summary
Director Deva Katta will be directing Gopi Chand Next. The project which has been delayed due to ANS for last year will finally take off soon the Director told to a Popular Newspaper. Deva himself will be preparing the script and other details haven't be revealed by the Director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu