»   » దేవా కట్టకు రాజమౌళి థాంక్స్, ఏం చేసాడని..?

దేవా కట్టకు రాజమౌళి థాంక్స్, ఏం చేసాడని..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుడలి' సినిమా టైటిల్స్ పడే సమయంలో దర్శకుడు దేవా కట్టకు థాంక్స్ చెబుతూ కూడా ఓ టైటిల్ వేయించాడు దర్శకుడు రాజమౌళి. అసలు దేవా కట్టుకు ‘బాహుబలి'కి సంబంధం ఏమిటి? అతని కోసం థాంక్స్ కార్డు ఎందుకు వేయించాడు అనేది చాలా మందికి అర్థం కాలేదు.

ఈ విషయమై ఆరా తీయగా... ఈ సినిమా కోసం దేవా కట్ట కొన్ని డైలాగ్స్ రాసిచ్చారట. సినిమా క్లైమాక్స్‌లో ఫ్రభాస్ చెప్పే డైలాగులు ఈయనే రాసాడట. ‘బాహుబలి' కోసం దేవా కట్ట కాంట్రిబ్యూషన్ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్ ఇస్తూ థాంక్స్ కార్డు వేయించాడు. దీనిపై దేవా కట్ట సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు.


Deva Katta tweet about Rajamouli

‘బాహుబలిలో వార్ సమయంలో ప్రభాస్ చెప్పే స్పీచులు కేవలం కొన్ని పదాలు మాత్రమే నేను రాసాను. రాజమౌళి సృష్టించిన బాహుబలి సముద్రంలో నేను చేసింది నీటి చుక్కంత మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్ కార్డు వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం' అంటూ దేవా కట్ట ట్వీట్ చేసాడు.

English summary
"just penned few words to the final war speach by Prabhas in BB. The effort is like a dew drop in an ocean of ssrajamouli creation. Acknowledging even that little effort with a thank you card only exhibits the maestro's generous heart. humbled!!" Deva Katta tweeted.
Please Wait while comments are loading...