»   » పవన్ పుట్టిన రోజున 'దేవదాసి' మోషన్ పోస్టర్

పవన్ పుట్టిన రోజున 'దేవదాసి' మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను, సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి' త్వరలో శ్రీ లక్ష్మీ నరసింహ సినీ చిత్ర బ్యానర్ లో ప్రారంభం కానుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ మాటలు దర్శకత్వం మధురావు మాదాసు. ప్రస్తుతం ఎందరో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెండి తెరపై తమ అద్రృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా తోట. బాలకృష్ణ పనిచేస్తున్నారు.

Devadasi poster releaed on Pawan Kalyans birthday

ఇతను గతంలో బాహుబలి 1 కు ఆపరేటివ్ కెమెరా మెన్ గా పని చేసి ఆ తరువాత ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీకి డీ.ఓ.పి గా పని చేసిన అనుభవం ఉంది. ఈ చిత్రానికి ఎడిటర్ గా ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతంరాజు గారు. సంగీతం 'యాజమాన్య', కొరియోగ్రఫీ శివశంకర్ మాస్టర్ మరియు విజయ్. రచనా సహకారం ఎ. వి. యస్. ఆదినారాయణ...
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ మొన్న వినాయక చవితి పండుగ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం జరిగింది.

Devadasi poster releaed on Pawan Kalyans birthday

ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొట్టమొదటి సారిగా ఒక మోషన్ పోస్టర్ ను ప్రేక్షకులు దర్శకుడిని హీరో ని మెచ్చుకుంటూ రివ్యూస్ వ్రాయడం తెలుగు లో బహుశా ఇదే మొదటిసారి అనుకుంట. అయితే మోషన్ పోస్టర్ చివరిలో గజ్జెలు పట్టుకుని కూర్చున్న దేవదాసి పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అనేది చిత్ర యూనిట్ బహిర్గతం చేయకపోవడంతో ప్రేక్షకులలో ఆమె ఎవరు అని ఆసక్తి నెలకొంది.

English summary
Devadasi movie poster released on Power Star Pawan Kalyan's birthday.Raju gadhi fame Chetan Chinu acting as hero in this movie. Makers kept devadasi role in secret. Bahubali fame Thota Balakrishna working as DOP.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu