»   » ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : తెలుగు వారికి 'దేవదాసు' అనగానే ముందుగా గుర్తుకొచ్చేది అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం నేటితో 61 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1953 జూన్ 26న విడుదలై ఈచిత్రం అప్పట్లో ఓ సంచలనం. తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు ఆజ్యం పోసింది కూడా ఈ సినిమానే.

  వాస్తవానికి 'దేవదాసు' మన కథ కాదు. సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవదాసు నవలను తెలుగులో చక్రపాణి అనువదించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో డిఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

  శరత్ సృష్టించిన గొప్ప పాత్ర నాగేశ్వరరావు చెయ్యడమేమిటని తొలుత విమర్శలు వచ్చాయి. అదే విధంగా పార్వతి పాత్రకు సావిత్రిని తీసుకోవడంపై, రాఘవయ్య ఈ సినిమాకి దర్శకుడిగా సరిపోడు అంటూ విమర్శలు వచ్చాయి. ఎవరెన్ని మాటలన్నా, నష్టపోతారని భయపెట్టినా మొండిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలెంజ్‌గా తీసుకుని తెరకెక్కించడం వల్లనే ఈ సినిమా అంత ఘన విజయం సాధించింది.

   ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఈ చిత్రానికి సీనియర్ సముద్రాల మాటలు, పాటలు హైలైట్‌గా నిలిచాయి. 11 పాటలుండటమే ఈ సినిమా గొప్ప.

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  "పల్లెకుపోదాం.. పారును చూద్దాం చలోచలో..", "అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా...", "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...", "జగమే మాయ బ్రతుకే మాయ.." ఇలా వేటికవే ప్రత్యేకతే.

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  1937లో లో హిందీలో పి.సి.బారువా తొలిసారిగా కె.ఎల్.సైగల్, జమునలతో ‘దేవదాసు' చిత్రాన్ని నిర్మించాడు. అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు, దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది.

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  మళ్ళీ 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రాసేన్‌లతో మరొక దేవదాసు వచ్చింది. మళ్ళీ హిందీలో లో షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్‌లతో 2002లో ఇదే కథ సినిమాగా వచ్చింది.

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు.

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  ఆజ్యం పోసింది అక్కినేనే, ఆ సంచలనానికి 61 ఏళ్లు (ఫోటో ఫీచర్)

  1974లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50రోజులు ఆడీతే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడింది.

  English summary
  Telugu film Devadasu starring Akkineni Nageshwara Rao, Savitri and Lalitha, was released exactly sixty one years ago on 26th June 1953. Based on Sharat Chandra Chattopadhyay’s novel and produced by D.L. Narayana, Devadas was a tragic romance that was made in several languages. Of all the versions of this tragic romance, it is the the Telugu version that is considered to be the best.
   
  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more