twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోల్ రీచ్ అయ్యాము.. నిధులు నిల్ అంటోన్న దేవరకొండ ఫౌండేషన్

    |

    విజయ్ దేవరకొండ అందరి కంటే ప్రత్యేకమని ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆర్థిక సాయం చేయకుండా సైలెంట్‌గా ఉన్నాడేంటి? అంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారు. మిగతా హీరోలంతా లక్షలు, కోట్లు విరాళాలు ఇస్తుంటే.. విజయ్ మాత్రం ఇంట్లో కూర్చుని ఉన్నాడని కామెంట్స్ చేశారు. అయితే సాయం చేయడంలోనూ విజయ్ శైలి వేరని మరోసారి నిరూపించుకున్నాడు.

    అందరూ పేదవాళ్లం కోసం నిలబడితే.. విజయ్ మాత్రం మధ్య తరగతి వాళ్ల గురించి ఆలోచించాడు. వీరి కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని ఇచ్చి తన ఫౌండేషన్ ద్వారా అందరికీ నిత్యావరసర సరుకులు అందించేలా ప్రణాళిక రూపొందించాడు. తాను మొదటగా ఓ రెండు వేల కుటుంబాలకు సాయం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించానని అయితే ఆ టార్గెట్‌ను పూర్తి చేసినట్టు తెలిపారు.

    Devarakonda Foundation MCF Received Good Response

    తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని, దాతల సాయంలో ఇప్పటి వరకు ఆరువేల కుటుంబాలకు సాయం చేశామని తెలిపారు. అయితే తమకు దాదాపు 77వేల అభ్యర్థనలు వచ్చాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం తమ వద్ద నిధులు అయిపోయాయని, అందుకే ఇక రిక్వెస్ట్‌లు తీసుకోవడం లేదని, ఆపేశామని ఓ ప్రకటన చేశారు. దయచేసి దాతలు ముందుకు రావాలని, ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేయాలని తద్వార మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేసినవారవుతారని పేర్కొన్నారు.

    English summary
    Devarakonda Foundation MCF Received Good Response. Till now helped 6000 families, as the fund is not sufficient for upcoming requests at present they stopped taking new requests.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X