twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో విశ్వక్ సేన్.. తలసానికి దేవి నాగవల్లి ఫిర్యాదు… చర్యలకు ఆదేశం?

    |

    సినిమా ప్రమోషన్స్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ ఇప్పుడు పెను దుమారానికి కారణమైంది. ఈ వ్యవహారం మీద ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమం పెట్టడంతో ఆ కార్యక్రమానికి విశ్వక్ సేన్ వెళ్లడమే కాక యాంకర్ ని అనకూడని మాట అనడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాజాగా ఈ వ్యవహారం మీద యాంకర్ దేవి నాగవల్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి హీరో విశ్వక్ సేన్ మీద ఫిర్యాదు చేసింది. ఈ విషయం మీద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

     కాస్త ఘాటుగానే

    కాస్త ఘాటుగానే


    తన సినిమా ప్రమోషన్ కోసం నడిరోడ్డు మీద సూసైడ్ అంటూ ఒక ప్రాంక్ వీడియో చేయడాన్ని ప్రశ్నిస్తూ యాంకర్ దేవి నాగవల్లి తాను పనిచేస్తున్న చానల్ లో ఒక డిబేట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ డిబేట్ కు హాజరైన విశ్వక్ సేన్ దేవి నాగవల్లి ప్రశ్నలకు సమాధానం లేక తనను పాగల్ సేన్ అని ప్రస్తావించడం మీద ఫైర్ అయ్యారు. డిప్రెస్డ్ పర్సన్ అని అనవద్దు అంటూ ఆమెకు చెబుతూ ఉన్న క్రమంలో ఆమె కూడా కాస్త ఘాటుగానే స్పందించారు.

    విశ్వక్ సేన్

    విశ్వక్ సేన్


    మాటలు జాగ్రత్తగా రానీయాలి అంటూ విశ్వక్ సేన్ మాట్లాడడంతో సంయమనం కోల్పోయిన దేవి నాగవల్లి స్టూడియో నుంచి గెటవుట్ ఇప్పుడే వెళ్లిపోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన ఇగో దెబ్బతినడంతో విశ్వక్ సేన్ కూడా అనూహ్యంగా ఒక బూతు మాట మాట్లాడాడు.. ఆ తర్వాత ఆ సమయంలో తను మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒప్పుకుంటూ సారీ చెప్పాడు. కానీ దేవి నాగవల్లి మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేట్టు కనిపించడం లేదు. ఈ విషయం మీద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన దేవి నాగవల్లి విశ్వక్ సేన్ మీద ఫిర్యాదు చేశారు.

     కరెక్ట్ కాదని

    కరెక్ట్ కాదని


    అదే సమయంలో మహిళా జర్నలిస్టులు కూడా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వారంతా కోరారు. ఈ క్రమంలో కచ్చితంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా ప్రమోషన్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయని అలా కాకుండా ఇలా రోడ్డెక్కి ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెడుతూ ప్రమోషన్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.

    అలాంటి మాటలు మాట్లాడకూడదు

    అలాంటి మాటలు మాట్లాడకూడదు


    ఈ విషయం మీద పోలీస్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇక స్టూడియోలో జరిగిన డిబేట్ వీడియో కూడా తాను చూశానని ఆ డిబేట్ జరిగిన సమయంలో దేవి నాగవల్లి విశ్వక్ సేన్ మధ్య జరిగిన సంభాషణ విన్నాను అని అన్నారు. ఆ సమయంలో విశ్వక్ సేన్ మాట తీరు సరిగా లేదని అందరూ చూస్తుండగానే లైవ్ లో ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అన్నారు.

     ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు

    ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు


    ఈ విషయం మీద ఫిలిం కార్పొరేషన్ తరఫున ఎలాంటి చర్యలు తీసుకోగలమో చూసి చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోగలరో చర్చించి తీసుకుంటామని అన్నారు.. సారీ చెప్పే సమయంలో కూడా చాలా లైట్ గా మీడియాతో మాట్లాడారు అని అలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. దీంతో విశ్వక్ సేన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

    English summary
    devi nagavalli gave complaint to talasani srinivas yadav about vishwak sen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X