»   » తండ్రిని తలుస్తూ... : దేవీ ఎమోషనల్ స్పీచ్ (వీడియో)

తండ్రిని తలుస్తూ... : దేవీ ఎమోషనల్ స్పీచ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ అంతా టైటిల్ కు తగ్గట్లే ఎమోషన్స్ తో నడిచింది. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, హీరో అందరూ భావోద్వేగంగా మాట్లాడారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడిన మాటలు అందరి హృదయాలనీ తాకాయి. ఆయనేం అన్నారో క్రింద చూద్దాం..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ... 'నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మా నాన్న సత్యమూర్తి గారికి థాంక్స్' అని మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ అన్నారు. 'ప్రతి ఫంక్షన్ కి మా నాన్నని తీసుకు వచ్చే వాడిని. మా సక్సెస్ ని మా నాన్నగారు చూసేలా చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా థాంక్స్. సామాజిక మాధ్య మాల్లో నాన్న మరణించిన సమయంలో(ఫేస్ బుక్, ట్విట్టర్) సపోర్ట్ చేసి వారికి కృతజ్ఞతలు' అని నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.

అలాగే...నీ తోటి టెక్నిషియన్ వర్క్ ను మనస్పూర్తిగా అప్రిషియేట్ చేయాలని మా నాన్న నాకు చెప్పిన మాటలే.. నన్ను ఈ రోజు ఈ స్థానంలో నిలిపేలా చేసిందన్నారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' టైటిల్ రావడం నా అదృష్టం. మైండ్ క్లియర్ గా ఉంటేనే సక్సెస్ వస్తుంది. మా నాన్న హార్ట్ ప్రాబలమ్ ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వారు.

Devi Sri Prasad Emotional Speech @ Nannaku Prematho Audio Launch

నాన్న ఆస్పత్రిలో ఉన్నప్పుడూ, ఒక్క రోజు కూడా నన్ను ఆస్పత్రికి రానివ్వకుండా తమ్ముడు సాగర్, అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకున్నారు. నా పాటలకు మీరు కొట్టే క్లాప్స్ విని మా నాన్న గారి కళ్లలో నీళ్లు వచ్చేవి. ఈ ఆడియో ఫంక్షన్ ని మానాన్నకి అంకితం చేయడం చాలా ఆనందంగా ఉంది అని దేవి అన్నారు.

English summary
Devi Sri Prasad Emotional Speech Nannaku Prematho Audio Launch. Nannaku Prematho ..Starring Jr NTR, Rakul Preet, agapathi Babu, Rajendra Prasad and Thagubothu Ramesh. Music composed by Devi Sri Prasad. Directed by Sukumar. Produced by BVSN Prasad under the banner Sri Venkateswara Cine Chitra.
Please Wait while comments are loading...