»   » ఫాదర్స్ డే జ్ఞాపకం: 3ఏళ్ల క్రితం తండ్రి కోసం దేవిశ్రీ ఖరీదైన గిఫ్ట్ (ఫోటోస్)

ఫాదర్స్ డే జ్ఞాపకం: 3ఏళ్ల క్రితం తండ్రి కోసం దేవిశ్రీ ఖరీదైన గిఫ్ట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, ప్రముఖ రచయిత సత్యమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. నాన్నను ఎంతో ప్రేమించే దేవిశ్రీ ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది.

ఫాదర్స్ డే సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'నేను ఎంతగానో ప్రేమించే నాన్న కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కారును మూడేళ్ల క్రితం ఆయన బర్త్ డే గిఫ్టుగా ఇచ్చాను...ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. లవ్ యూ డాడీ' అంటూ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసారు.

దేవిశ్రీ సంగీతం అందించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందే సత్యమూర్తి మరణించిన సంగతి తెలిసిందే. నాన్న కోసం దేవిశ్రీ ప్రత్యేకంగా ఓ పాట కూడా రచించారు.ఈ పాటను 'నాన్నకు ప్రేమతో' చిత్రం ముగింపులో ఉంచారు.

స్లైడ్ షోలో దేవిశ్రీ ప్రసాద్ తన తండ్రి కోసం మూడేళ్ల క్రితం ఇచ్చిన గిఫ్ట్ ఫోటోస్....

దేవిశ్రీ-సత్యమూర్తి

దేవిశ్రీ-సత్యమూర్తి

తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని దేవిశ్రీ ఇటీవల ఓ పాట రూపంలో వెల్లడించారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు

దేవిశ్రీ తయారు చేసిన స్పెషల్ డిజైన్డ్ కారులో సత్యమూర్తి దంపతులు.

ఖరీదైన

ఖరీదైన

ఖరీదైన కారులో...ఈ ఖరీదైన డిజైన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా ఖర్చు చేసినట్లు సమాచారం.

బర్త్ డే గిఫ్ట్

బర్త్ డే గిఫ్ట్

మూడేళ్ల క్రితం తండ్రి బర్త్ డే సందర్భంగా దేవిశ్రీ ఈ గిఫ్టు ఇచ్చారు.

English summary
"I gifted this Specially designed Car for my Dad's Birthday 3 years back.. thought of sharing it on Father's Day!! Love you Daddy" Devi Sri Prasad tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu