శవాలతో సెక్స్.. దేవీ శ్రీ ప్రసాద్‌కు సంబంధమేమిటీ?
నెక్రోఫీలియా అంటే శవాలతో సెక్స్ అనే కథాంశంతో దేవిశ్రీ ప్రసాద్ అనే తెలుగు సినిమా
సంప్రదాయ సినిమా నిర్మాణాలకు విభిన్నంగా తెలుగు సినీ పరిశ్రమలో కూడా ప్రయోగాలకు తెరలేపుతున్నారు. తాజాగా నెక్రోఫీలియా అంటే శవాలతో సెక్స్ అనే కథాంశంతో దేవిశ్రీ ప్రసాద్ అనే తెలుగు సినిమా రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ అనే సినిమాలో స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తున్నది.

అసలు ఈ సినిమా కథ ఏంటంటే.. హీరోయిన్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. మార్చురీలో పెట్టిన శవంపై దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడుతారు. మనోజ్ నందం, ధన్ రాజ్, మరో నూతన నటుడు సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ కిషోర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెన్సార్‌కు పంపనున్నారు.


Click it and Unblock the Notifications











