»   » దేవీశ్రీ ప్రసాద్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ (రేర్ ఫోటో)

దేవీశ్రీ ప్రసాద్ షేర్ చేసిన పవన్ కళ్యాణ్ (రేర్ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ పవన్ కళ్యాణ్ కీ, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కి మంచి ర్యాపో ఉంటుంది. పవన్ పుట్టిన రోజున తన ట్వీట్ లో...మెగాస్టార్, పవన్ కళ్యాణ్, తన తండ్రి సత్యమూర్తి ఉన్న రేర్ ఫోటోని షేర్ చేసారు.

ఈ విషయమై దేవి ట్వీట్ చేస్తూ... హ్యాపీ భర్తడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ !! మా నాన్న సత్య మూర్తి గారు నుంచి సంపాదించిన రేర్ ఫోటో ఇది. పవర్ స్టార్, మెగాస్టార్ కలిసి ఉన్న ఫోటో.. మీకందరీకి ఈ పోటో నచ్చుతుందని భావిస్తున్నాను !! :))

ఇప్పుడు ఎక్కడ వింటున్నా 'అత్తారింటికి దారేది' పాటలే. ఈ చిత్రంలో పాటలు ఇప్పుడు యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ పాటలు ఇంతలా జనంలోకి దూసుకువెళ్లటానికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అయితే మరో కారణం మ్యూజికల్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి. పవన్‌కల్యాణ్ సినిమాల్లో పాటలు బావుంటాయి. అలాగే త్రివిక్రమ్‌క్కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఇక వీరిద్దరికీ దేవిశ్రీప్రసాద్ జత కలిస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ 'జల్సా' పాటలు ఈ ముగ్గురి కాంబినేషన్‌లోని మజా ఏంటో చూపించాయి.

ఇప్పుడేమో 'అత్తారింటికి దారేది' పాటలు కూడా ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. 'ఆరడుగుల బుల్లెట్టు' అనే పాట అభిమానులకో పెద్ద కిక్కు. ఈ పాటలో శ్రీమణి రాసిన సాహిత్యానికి మంచి అప్లాజే వస్తోంది. అలాగే రామజోగయ్యశాస్త్రి రాసిన 'బాపు గారి బొమ్మో', 'దేవ దేవం', 'కిర్రాకు' పాటలు కిర్రెక్కించేలా ఉన్నాయి. ఈ పాటల్లో రామజోగయ్యశాస్త్రి ఎక్స్‌ప్రెషన్స్ చాలా లవ్లీగా ఉన్నాయంటున్నారు. ఆడియో సక్సెస్‌తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

నిర్మాత ఈ చిత్రం పాటల గురించి మాట్లాడుతూ..."ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

English summary

 Devi Sri Prasad tweeted: " Happy Birthday to PowerStar Pawan Kalyan!! A rare pic I got from my Dad Satya Murty Garu with PwrStar and MegaStar.!!I Hope you all will like it !! :))"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu