Just In
- 13 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 55 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- News
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా..
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేక పుట్టిస్తున్న దేవినేని ఫస్ట్ లుక్.. వంగవీటి రంగాగా సురేష్ కొండేటి
బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా ప్రత్యేకమైన స్థానం. రంగా, నెహ్రూల మధ్య వైరం అప్పట్లో చర్చనీయాశమైంది. బెజవాడ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన మేటి నాయకుడిగా వంగవీటి రంగా (జూలై 4 జననం- 26 డిసెంబర్ మరణం) ప్రస్థానం ఎంతో గొప్పది. రంగా హత్య బెజవాడను అతలాకుతలం చేసింది. బెజవాడ రౌడీ రాజకీయాల్లో అతడి హత్య పేదల గుండెల్ని మరిగించింది. వంగవీటి రంగాకు ధీటైన వర్గంగా బెజవాడ రాజకీయాల్లో ఎదిగిన దేవినేని నెహ్రూ సోదరుల ప్రస్థానం అంతే గొప్పది. రంగా - నెహ్రూల మధ్య స్నేహం స్థానంలో శత్రుత్వం పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే అవన్నీ చరిత్రలో నిక్షిప్తం అయ్యి ఉన్న గొప్ప నగ్నసత్యాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా .. దేవినేని నెహ్రూ.ఇప్పుడు ఆ ఇద్దరి కథతోనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి దేవినేని అనే టైటిల్‌ను నిర్ణయించిన సంగతి తెలిసిందే. బెజవాడ సింహం అనేది ఉపశీర్షిక. శివనాగు దర్శకత్వంలో ఆర్‌టిఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూగా టైటిల్ పాత్రలో నందమూరి తారకరత్న నటిస్తుండగా ..వంగవీటి రంగా పాత్రలో పత్రికాధిపతి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి (సంతోషం సురేష్) నటిస్తున్నారు.

నేడు వంగవీటి రంగా 72వ జయంతి సందర్భంగా రంగా పాత్రధారి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. బెజవాడలో జరిగిన ఇద్దరు మహానాయకుల మధ్య జరిగిన యదార్థ కథను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

నిర్మాత రామూరాథోడ్ మాట్లాడుతూ .. దేవినేని - రంగా పాత్రలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఉంటాయి. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరిస్తున్న ఈ చిత్రం చాలా నేచురల్‌గా వుంటుంది. తాజాగా వంగవీటి రంగా పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాం. రంగా పాత్రలో సురేష్ కొండేటి నటన ఆకట్టుకుంటుంది. దేవినేని పాత్రలో తారకరత్న అంతే అద్భుతంగా నటించారు అని తెలిపారు.