»   »  వర్మకు నాకు పాత పరిచయాలు ఉన్నాయి...దేవినేని నెహ్రూ

వర్మకు నాకు పాత పరిచయాలు ఉన్నాయి...దేవినేని నెహ్రూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడకు వచ్చిన వర్మ మాజీమంత్రి దేవినేని నెహ్రూను ఆయన స్వగృహంలో కలిసి చర్చించారు. తనకు రంగాకు మధ్య జరిగిన వివాదం రౌడీయిజం కాదని, ఆధిపత్య పోరు మాత్రమేనని నెహ్రూ చెప్పినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు లీక్ కావడంతో తర్వాత ఇద్దరూ అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను తీయబోయే సినిమా బెజవాడ బ్యాక్ డ్రాప్‌తోనే ఉంటుందని, కమర్షియల్ ఎలిమెంట్ తీయకుండా ఉంటానికి తాను గౌతమబుద్ధుడిని కాదని వర్మ అన్నారు. అలాగే అందుకే ఆరు నెలల క్రితమే 'బెజవాడ రౌడీలు' టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నానని చెప్పారు. అనంతరం దేవినేని నెహ్రూ మాట్లాడుతూ... తనకు, వర్మకు పాత పరిచయాలు ఉన్నాయన్నారు. గతంలో శివ, గాయం సినిమాలు తీసిన సమయంలోనూ వర్మ తనను కలిసి మాట్లాడారన్నారు.

సిద్దార్థ కళాశాలలో పర్యటన సందర్భంగా, మీ సినిమాల్లో మహిళను అంత అర్ధనగ్నంగా చూపించాల్సిన అవసరం ఉందా? అని వర్మను ఒక మహిళా న్యాయవాది నిలదీసింది. దానికి వర్మ సమాధానంగా వ్యాపారం కోసం ఏమైనా చేస్తాం అని సమర్థించుకున్నారు. కొందరికి ఇష్టంకానిది.. మరి కొందరికి ఎంతో ఇష్టమని, అందరి ఇష్టాలూ తీర్చాల్సిన బాధ్యత దర్శకులపై ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో ఏం మాట్లాడాలో అర్ధంకాని మహిళా న్యాయవాది మిన్నకుండిపోయారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu