»   »  దేవిశ్రీ రేటు రూ.1.25 కోట్లు

దేవిశ్రీ రేటు రూ.1.25 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హీరోగా, సంగీత దర్శకుడిగా జనాన్ని మెప్పించడం అంత సులువుకాదని ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. అది నిజమేననిపిస్తుంది. హీరోలకున్నంత క్రేజ్ సంగీత దర్శకులకు ఉంది. సంగీతం మీదే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే సక్సెస్ ఫుల్ సంగీత దర్శకులకు మంచి డిమాండ్ ఉంది. తెలుగులో మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ లు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకే వారి రెమ్యునరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరిద్దరూ రూ.1కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ మరో అడుగు ముందుకువెళ్లి రూ.1.25 కోట్లకు పెంచినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మొత్తం చాలామంది హీరోల రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కదిద్దుకోవడమంటే ఇదే కాబోలు.

Read more about: devisri prasad music director
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X