»   »  ఆమె సింగర్ తప్ప నా లవర్ కాదు!!!

ఆమె సింగర్ తప్ప నా లవర్ కాదు!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో పేరున్న యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగానే కాదు హీరోయిన్లతో అఫైర్లతోను పేరున్నవాడే. చార్మీతో ప్రేమాయణం నడిపిన దేవీశ్రీ పెళ్లికి చార్మీ తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమెతో సంబంధాలు ఇపుడు కట్ అయినట్టు సమాచారం. ఈ మధ్యే నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్న యాక్టర్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు గుప్పుమన్నాయి. నిజానికి ఆమె నటిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ ఆమెతో పాడించి దేవిశ్రీ చేసిన ప్రయోగం విజయవంతమయింది. ఆమె పాడిన ఆకలేస్తే పాట ఎంత పాపులరో తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నదా లేదా అని అడిగిన ప్రశ్నలకు దేవీశ్రీ వివరణ ఇచ్చాడు. మమతా మోహన్ దాస్ గొంతు చాలా స్వీట్ గా ఉండడం వలననే ఆమెతో పాటలు పాడించానని, పాటలు పాడించే సమయంలోనే ఆమెతో మాట్లాడాను తప్ప ఆమెతో ఇంకేమీలేదని చెప్పాడు. ఆమె మంచి సింగర్ తప్ప తన లవర్ కాదని స్పష్టం చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X