»   » కమల్ హాసన్, మాధవన్ మధ్యలో త్రిష

కమల్ హాసన్, మాధవన్ మధ్యలో త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

సత్యమే శివం చిత్రం అనంతరం...మరో సారి కమల్ హాసన్, మాధవన్ మళ్ళీ కలసి నటించబోతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారవుతున్న ఈ చిత్రం కామిడీగా తయారవబోతోంది. ఇక ఈ చిత్రంలో త్రిష వీరిద్దరి మధ్యన నలిగిపోతూ నవ్వించే పాత్రలో కనిపించబోతోంది. కమల్ తో దశావతారం రూపొందించిన ప్రముఖ దర్శకుడు కెఎస్ రవి కుమార్ డైరక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రానికి సంగీత భాద్యతలు దేవిశ్రీ ప్రసాద్ కి అప్పగించారు. దశావతారం అనంతరం కమల్ హాసన్ తో మరో సారి చేసే అవకాశం దక్కటంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఉదయగిరి స్టాలిన్ నిర్మిస్తున్నారు. తెలుగులో డబ్ చేయటానికి వీలుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రిష...ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా చిత్రంలో చేస్తోంది. ఆమె తెలుగులో చేయగా రిలీజైన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి రిలీజై యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఇక మాధవన్ త్రీ ఈడియట్స్ చిత్రంలో నేషనల్ మార్కెట్ సంపాదించుకోవటంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu