»   » నాగచైతన్య చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం...

నాగచైతన్య చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్సకుడుగా ఎంపిక చేసారు. అందులోనూ సుకుమార్ మూడు చిత్రాలకూ దేవీనే సంగీతం ఇచ్చారు. అలాగే అవి కూడా మ్యూజిక్ విషయంలో ఎక్కడా ఫెయిల్యూర్ కాలేదు. మే 19 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని గీతా అర్ట్స్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఆర్య 2 తర్వాత సుకుమార్ డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే. బావ, మరదళ్ళ చుట్టూ తిరుగే కథతో ఈ చిత్రం ఫన్నీగా సాగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే నాగచైతన్య సరసన తమన్నాని ఎంపిక చేసారు. ఇక ఏ మాయ చేసావె తర్వత నాగచైతన్య డిమాండ్ ఉన్న స్టార్ గా మారారు. యువతరం ప్రేమ కథలకు అతన్ని ఎన్నుకుంటున్నారు. అలాగే అజయ్ భుయాన్ (రిలీజ్ కాని హౌస్ ఫుల్ దర్శకుడు) డైరక్షన్ లోనూ నాగచైతన్య చేస్తున్నారు. డి శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి డైరక్షన్ లో రూపొందిన పయ్యా చిత్రంలో తమన్నా చేసింది. ఆ చిత్రం అవారా పేరుతో డబ్బింగై త్వరలో రిలీజ్ కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu