»   »  ఫొటోలు : దేవిశ్రీప్రసాద్,పవన్ సర్దార్‌ గబ్బర్‌ సింగ్ సెట్స్

ఫొటోలు : దేవిశ్రీప్రసాద్,పవన్ సర్దార్‌ గబ్బర్‌ సింగ్ సెట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న గురువారం నుంచి హైదరాబాద్‌లో సర్దార్‌ గబ్బర్‌ సింగ్ చిత్రం కోసం ప్రత్యేకగీతాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కళా దర్శకుడు బ్రహ్మ కడలి నేతృత్వంలో తీర్చిదిద్దిన ఓ సెట్‌లో పవన్‌, రాయ్‌లక్ష్మీలపై ఆ పాటని చిత్రీకరించారు. ఈ నేపధ్యంలో సంగీత దర్సకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సెట్స్ కు వచ్చారు. ఆయన ఈ విషయాన్ని తన ట్వీట్ ద్వారా తెలియచేసి అక్కడ ఫొటోలు షేర్ చేసారు. ఆ ఫొటోలు క్రింద స్లైడ్ షోలో చూడండి.

గుండెలనిండా ధైర్యమే కాదు... మనసు నిండా ప్రేమ కూడా ఉన్నోడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌. పోలీసు కదా అని ఎప్పుడూ గన్నులతోనే గడుపుతుంటాడనుకొంటే పొరపాటు. అప్పుడప్పుడు జున్ను లాంటి అమ్మాయిలతోనూ సరసాలు ఆడుతుంటాడు. మొన్నటిదాకా విలన్స్ పై తూటాలు పేల్చిన సర్దార్‌ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయితో ఆడిపాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ హంగామా ఎలా ఉంటుందో 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమాలోనే చూడాలని

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్‌ హీరోయిన్. రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్‌ మరార్‌ నిర్మాత.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి

దేవితో జల్సా నుంచీ

దేవితో జల్సా నుంచీ

దేవిశ్రీప్రసాద్ ..గతంలో పవన్ కళ్యాణ్ ..జల్సా చిత్రానికి, అత్తారింటికి దారిది, గబ్బర్ సింగ్, ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు కు చేస్తున్నారు.

ఉషారిచ్చే

ఉషారిచ్చే

దేవి ఇచ్చే ఉషారైన ట్యూన్స్ అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టమని చెప్తారు

ఉత్సాహం

ఉత్సాహం

పవన్ కళ్యాణ్ చిత్రానికి పనిచేయటం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని దేవి చెప్తూంటారు

అదిరాయి

అదిరాయి


ఈ చిత్రంలోని పాటలు కూడా ఇప్పటికే అదిరే స్ధాయిలో వినిపించాడని టాక్

ఐటం సాంగ్

ఐటం సాంగ్


ఈ సినిమాలో ఐటం సాంగ్ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.

కెవ్వుకేక

కెవ్వుకేక

గబ్బర్ సింగ్ లోని కెవ్వు కేక పాటను మరిపించేలా ఈ ఐటం సాంగ్ ని సమకూర్చాడని తెలుస్తోంది.

లక్ష్మీరాయ్ కు ఇది తొలి సారి

లక్ష్మీరాయ్ కు ఇది తొలి సారి

'కాంచనమాల కేబుల్‌టీవీ'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత కూడా బోలెడన్ని చిత్రాలు చేసింది. ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. అయితే పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించడం ఇదే తొలిసారి.

పాటలుకు ప్రత్యేక స్ధానం

పాటలుకు ప్రత్యేక స్ధానం

తొలినుంచి పవన్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్ధానం ఉంటూ వస్తోంది.

దగ్గరుండి

దగ్గరుండి


పవన్ దగ్గరుండి మరీ ట్యూన్స్ ఎంపిక చేయటమే ఆడియో అంత రేంజిలో సక్సెస్ కు కారణం అని చెప్తారు.

ఎవరెవరు

ఎవరెవరు


నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
DEVI SRI PRASAD ‏ tweeted: Wit PowerStar during d song shoot of SARDAR GS2!! He was Rockin d steps!! Had a grt time!! Grt Job dirbobby
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu