For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఇద్దరమ్మాయిలతో' లో ఐటం గర్ల్ ఈ సెక్స్ బాంబే( లొకేషన్ ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' . ఈ చిత్రంలో ఐటం బాంబ్ గా..బాలీవుడ్ నటి దేవషి కందూరిని ఎంపిక చేసారు. ఆమెపై స్పెషల్ గా రీసెంట్ గా స్పెయిన్ లో ఓ పాటను చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్తున్నారు.

  ఈ విషయమై దేవషి మాట్లాడుతూ... నేను ఈ పాటలో ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేసాను. ఈ అవకాసం ఇచ్చినందుకు దర్శకుడు పూరీ జగన్ గారికి నా కృతజ్ఞతలు. ఈ పాటలో నాకు ప్రత్యేకమైన కొరియోగ్రఫీ చేసారు. అదీ బాగా నచ్చింది. అందులోనూ స్పెయిన్ లో ఈ రొమాంటిక్ ఐటం నెంబర్ షూట్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది అంది. ప్రస్తుతం ఆమె ది సిటీ నెవర్ స్లీప్స్ చిత్రం చేస్తోంది.

  ఇక ఈ చిత్రం సింహ భాగంస్పెయిన్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంంలో...అల్లు అర్జున్ పాత్ర డిఫెరెంట్ గా సాగుతుంది. ఒకేసారి ఇద్దరికి లైన్ వేస్తూంటారు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు. అయినా ఒకరికి తెలీయకుండా మరొకరికి గాలం వేశాడు. టైమ్‌ టేబుల్‌ ప్రకారం ఇద్దరి దగ్గరా ప్రేమ పాఠాలు వల్లించాడు ఈ అల్లరి ప్రేమికుడు. అయితే అందుకు ఓ కారణం ఉంది. అదేమిటి? ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమలోకి ఎందుకు దించాల్సి వచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాల్సిందే అంటున్నారు.

  దేవషి కందూరి సెక్సీ ఫోటోలు స్లైడ్ షోలో...

  ఈమె చేసే ఆ పాటలో తెలుగులో సైతం బిజీ ఐటం గర్ల్ గా సెటిలవుతాననే విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

  అల్లు అర్జున్ తో సెట్ లో...

  పూరీ జగన్నాధ్ ని మెచ్చుకున్న ఆమె...మరి...మరో ముమాయిత్ ఖాన్ అవుతుందేమో చూడాలి

  గణేష్ మాస్టర్ కొరియోగ్రఫి తెరపై ఓ రేంజిలో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని చెప్తోంది.

  స్పానిష్ లోకల్ గర్ల్ లాగ ఆమె ఈ పాటలో కనిపించనుంది.

  పాట ఎలా వచ్చిందో చూసుకోవాలిగా మరి..

  తప్పకుండా తెలుగు తెరపై ఆమె వేడి తుఫానులు సృష్టిస్తుంది.

  అమలాపాల్‌, కేథరిన్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాత.

  'ప్రేమ, వినోదం మేళవించిన కథ ఇది. రొమాంటిక్‌గా సాగుతుంది. ముక్కోణపు ప్రేమ కథలో మలుపులు ఆద్యంతం ఆకట్టుకొంటాయి''అని చిత్ర బృందం తెలిపింది. ట

  ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే...తనని తాను ప్రేమించుకోవడమే కాదు... ఆ ప్రేమని మరొకరికి పంచడం కూడా తెలిసిన కుర్రాడతను. ఒకరికి వాటా ఇస్తే... ఇబ్బంది లేకపోదును. ప్రేమ మరీ ఎక్కువైపోయి... ఒకేసారి ఇద్దరికి మనసిచ్చేశాడు. ఆ ప్రేమాయణం ఏ తీరానికి చేరిందో తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాలి అని చెప్తున్నారు.

  'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి.

  ఇద్దరు హీరోయిన్స్ తో నటించడం అల్లు అర్జున్‌కీ ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం అమలాపాల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకొంది. బ్యాంకాక్‌లో ఆమెపై ఓ పోరాట సన్నివేశం కూడా తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

  నిర్మాత బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడకుండా బన్నీ ఇమేజ్ కు తగిన విధంగా స్టైలిష్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీనీ లవర్ బాయ్‌లా చూపెట్టబోతున్నాడు దర్శకుడు పూరి. దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

  English summary
  Director Puri Jagannath is all set to introduce Bollywood actress Devshi Khanduri in his next venture, Iddarmmayilatho. Devshi shot for a special song in Spain recently. Ganesh Master choreographed the song. "It was great to shoot a romantic number in the city of love Spain. I enjoyed every moment. I am grateful to director Puri Jagannath for giving me the opportunity. I love the choreography of the song it's very unique and special to me," says Devshi who is looking forward to the release of her upcoming Hindi movie, The City That Never Sleeps.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X