»   » నాగచైతన్య 'దడ' రిలీజ్ డేట్ ఫిక్స్

నాగచైతన్య 'దడ' రిలీజ్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'దడ' చిత్రం ఆగస్టు 11న విడుదల చేసేందుకు డేట్ ని పిక్స్ చేసినట్లు సమాచారం. శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అజయ్‌ భుయాన్‌ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. 'అమెరికా నేపథ్యంలో సాగే కథ 'దడ'. అక్కడ ఓ భారతీయ యువకుడికి ఎదురైన అనుభవాల చుట్టూ చిత్రం తిరుగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌...ఇవన్నీ సమపాళ్లలో మేళవించి చూపిస్తున్నాం అంటున్నారు 'దడ'చిత్రం నిర్మాత. 'దడ'లో శ్రీరామ్‌, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌ రిషి, కెల్లీ డార్జ్‌, తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌ తదితరులు నటిస్తున్నారు. మాటలు: అబ్బూరి రవి, స్త్టెలింగ్‌: డి.ప్రణతిరెడ్డి, సహ నిర్మాత: విశ్వచందన్‌రెడ్డి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

English summary
Naga Chaitanya’s Dhada is slated for a release on 11th August. Dhada is being directed by a debutant Ajay Bhuyan and produced by D.Shiva Prasad Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu