For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లవర్ బాయ్ ఇమేజ్ వద్దనుకున్నా..అందుకే మాస్ సినిమాలు చేస్తున్నా

  By Sindhu
  |

  నటుడిగా ఒకే రకమైన ఇమేజ్‌తో కొనసాగడం నాకిష్టముండదు. ఏ నటుడైనా ఒకే రకమైన ఇమేజ్‌తో కెరీర్‌ను కొనసాగించలేరు.'ఏ మాయ చేసావె" '100 %లవ్" చిత్రాల తర్వాత రొమాంటిక్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటపడి మాస్ సబ్జెక్ట్ చేయాలనుకున్నాను. నా అభిమానులు కూడా ఆదే ఆశించారు. అందుకే 'దడ"లాంటి పూర్తి మాస్ ఎంటర్‌ టైనర్‌ను చేశాను. 'బెజవాడ రౌడీలు, ఆటోనగర్ సూర్య"...ఇలా మాస్ సబ్జెక్ట్స్ కే ఎక్కువగా ప్రాధాన్య తనిస్తున్నా. అందుకే లవర్‌బోయ్ ఇమేజ్ నుంచి బయటపడి కొత్త తరహా సబ్జెక్ట్స్ ను ఎంచుకుంటున్నాను.స్వతహాగా నాకు హాలీవుడ్ తరహాలో వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలంటే ఇష్టం" అన్నారు నాగచైతన్య. కామాక్షి ఎంటర్‌ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'దడ" చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య మీడియా వారితో తన మనోభావాల్ని పంచుకున్నారిలా....

  'దడ" గురించి మాట్లాడుతూ స్టైలిష్ మాస్ ఎంటర్‌ టైనర్ 'దడ". నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో పూర్తి భిన్నంగా కనిపిస్తాను. 'ఏ మాయ చేసావె" '100 % లవ్" లాంటి ప్రేమ కథలు చేసిన తర్వాత అభిమానులు నా నుంచి మంచి మాస్ ఎంటర్‌ టైనర్‌ ను ఆశిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్, డ్యాన్స్ విషయాలపై బాగా దృష్టి పెట్టాను. ఇందులో కూడా లవ్‌ స్టోరీ వుంటుంది. మాస్ ఎలిమెంట్స్ వున్నా హాలీవుడ్ సినిమా తరహాలో చాలా స్టైలిష్‌ గా వుంటుంది. రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా సినిమా అంతా రియలిస్టిక్‌ గా వుంటుంది. హాలీవుడ్‌ కు చెందిన సాంకేతిక నిపుణులు చాలా మంది ఈ సినిమా కోసం పనిచేశారు.

  సినిమా స్టోరీ అందులో అతని పాత్ర గురించి మాట్లాడుతూ..అమెరికా నేపథ్యంలో కథ నడుస్తుంది. అమెరికాలో వుండే హీరో పది రోజులు ఇండియాలో వుందామని వస్తాడు. ఆ పది రోజుల్లో అతని జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సమయంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? వాటిని అతను ఎలా అధిగమించాడు అనే అంశాలన్నీ ఆసక్తికరంగా వుంటాయి. రొమాన్స్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ వుంటాయి. యాక్షన్, డ్యాన్స్ విభాగాల్లో నా బెస్ట్ పెర్‌ఫ్మాన్స్ ఈ చిత్రంలో చూస్తారు.

  నాగార్జున వారసుడిగా పరిక్షిశమలోకి అడుగుపెట్టారు. ఓ స్టార్ తనయుడు అనే ఇమేజ్ మీ సక్సెస్‌లో ..సినిమా నేపథ్యం వుంది కాబట్టి ఇండస్ట్రీలోకి సులభంగా ఎంటర్ కావొచ్చు కానీ ఆ ఇమేజ్ అనేది మొదటి రెండు సినిమాలకి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన టాలెంట్‌పైనే మన సక్సెస్ ఆధారపడి వుంటుంది. ఇక తన ప్రస్తుత ప్రొజెక్ట్ గురించి మాట్లాడుతూ 'బెజవాడ రౌడీలు" షూటింగ్ పూర్తయింది. 'ఆటో నగర్ సూర్య" అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యంలో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌ గా వుంటుంది. దేవాకట్టా సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా ఓకే చేశాను అన్నారు నాగచైతన్య.

  English summary
  Naga Chaitanya entered the film industry with ‘Josh’, captured the audience hearts with ‘Ye Maya Chesave’,stabilized himself in the industry with ‘100% Love’ and now coming to theaters to create ‘Dhada’ at the box-office. ‘Dhada’ is releasing on August 11th. Hence as part of promotion Naga Chaitanya organized a press meet at Annapurna Studios and spoke to the media yesterday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X