»   » ‘ధనరాజ్, వేణు, తాగుబోతు రమేష్‌, చమ్మక్‌చంద్ర’ హీరోలుగా..

‘ధనరాజ్, వేణు, తాగుబోతు రమేష్‌, చమ్మక్‌చంద్ర’ హీరోలుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: "ధనరాజ్‌-వేణు-తాగుబోతు రమేష్‌ మరియు చమ్మక్‌చంద్ర" కలిసి బుల్లితెరపై చేసిన కామెడీ షోలు ఏ రేంజిలో హిట్టయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. త్వరలో ఈ నలుగురు కామెడీ స్టార్లను హీరోలుగా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి హాస్యప్రధాన చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి అనే ఓ యువ వ్యాపారవేత్త నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథ రెడీ అయిందని తెలుస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఇంకా ఎవరు నటిస్తున్నారు అనే పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Dhanraj, Venu, Thagubothu Ramesh, Chammak Chandra movie

ఈ సినిమా గురించి ధనరాజ్‌ మాట్లాడుతూ.. ‘నేను, వేణు, రమేష్‌, చంద్ర.. నలుగురం ఈ కథ వింటున్నంత సేపూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాం. నిజ జీవితంలో మంచి స్నేహితులమైన మేం నలుగురం ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండడం చాలా సంతోషంగానూ, ఎగ్జయిటింగ్‌గానూ ఉంది. ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నాం ' అన్నారు.

English summary
Dhanraj, Venu, Thagubothu Ramesh, Chammak Chandra movie launching soon.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu