Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్కడ ‘కోడి’, మనకు ధర్మ యోగి: ఊరమాస్ క్యారెక్టర్లో ధనుష్ (ఫోటోస్)
హైదరాబాద్: 'రఘువరన్ బి.టెక్' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా 'రైల్' చిత్రంతో ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. ఈ దీపావళికి మరో డిఫరెంట్ మూవీతో ధనుష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి'(ది లీడర్) పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

ధనుష్ తొలిసారి
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్.సతీష్‌కుమార్ మాట్లాడుతూ - ''ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే అందుకే ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేస్తున్నామన్నారు.

తెలుగులో ధర్మయోగి
ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంలో ధనుష్ చేసిన రెండు క్యారెక్టర్స్ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రను చేసారని నిర్మాత తెలిపారు.

పోస్ట్ ప్రొడక్షన్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చెయ్యబోతున్నామని తెలిపారు నిర్మాత.

సంతోష్ నారాయణన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ రెండో వారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

ఈ దీపావళికి
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నామని నిర్మాత తెలిపారు.

నటీనటులు
ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ ఎస్., ఎడిటింగ్: ప్రకాష్ మబ్బు, సంగీతం: సంతోష్ నారాయణన్, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.