»   » రామ్ చరణ్‌ కంటే ముందున్న ధనుష్

రామ్ చరణ్‌ కంటే ముందున్న ధనుష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా 'రాంఝానా' సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడు. సౌతిండియాలో బాగా పాపులర్ అయిన ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఒకేసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

వాస్తవానికి ధనుష్ కంటే ముందే రామ్ చరణ్ 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగు పెట్టారు. చాలా కాలం క్రితమే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పూర్తి కూడా అయింది. అయితే అనేక వివాదాల కారణంగా 'జంజీర్'చిత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు.

అయితే రామ్ చరణ్ కంటే కాస్త ఆలస్యంగా బాలీవుడ్లో అడుగు పెట్టిన ధనుష్, సోనమ్ కపూర్‌తో కలిసి 'రాంఝానా' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. రామ్ చరణ్ కంటే ఆలస్యంగా వచ్చినా........సినిమా విడుదల విషయంలో మాత్రం చెర్రీ కంటే ముందున్నాడు ధనుష్.

రామ్ చరణ్ 'జంజీర్' మూవీ చుట్టూ రెండు వివాదాలు అలుముకున్నాయి. జంజీర్ ఒరిజినల్ వెర్షన్ రచయితలు అయిన సలీమ్, జావేద్‌ అక్తర్‌లు తమ కథను మళ్లీ రీమేక్ చేయడానికి తమ అనుమతి తీసుకోలేదని, తమ స్టోరీని వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఈ చిత్రం రీమేక్ విషయంలో నిర్మాత, అతని సోదరులకు మధ్య ఆర్థిక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విడుదల ఆలస్యం అవుతోంది.

English summary
South actors Dhanush and Ram Charan Teja will soon make their entry into Bollywood."Zanjeer" was expected to get released before the first half of this year. Unfortunately Zanjeer has been facing troubles for the last few months. On the other hand, south actor Dhanush has taken the lead over Ram Charan Teja with his debut flick "Raanjhanaa" getting released on 21 June.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu