»   »  ధనుష్ హాలీవుడ్ మూవీ "ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్" ఎందుకు ఆగిపోయింది??

ధనుష్ హాలీవుడ్ మూవీ "ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్" ఎందుకు ఆగిపోయింది??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అక్కడి అభిమానులకు ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర లేదు. ఒకదశలో రజినీ సినిమా రిలీజ్ అయ్యిందంటే..పెద్ద పండుగ చేసుకుంటారు. ఇక అయన పెద్దకూతురు భర్త దనుష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొత్తలో పెద్దగా విజయాలు సాధించకపోయినా చిన్న చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు దనుష్ బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు తీసి అక్కడ కూడా మంచి ఇమేజ్ సంపాదించాడు.

తాజాగా ధనుష్ హాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా తమిళంలో ధనుష్ హీరోగా 'మరియన్' అనే మూవీ వచ్చింది. ఆ చిత్రంలో ధనుష్ పెర్ఫార్మెన్స్ చూసి ధనుష్ కు హాలీవుడ్ మూవీకు సెలెక్ట్ చేశారు. రజినీకాంత్ తో ధనుష్ హాలీవుడ్‌లో ధనుష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్ హు గాట్ ట్రాప్డ్ ఇన్ యన్ ఇకియా కప్ బోర్డ్' అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఉమా తుర్మన్ ఈ మూవీలో ధనుష్ సరసన నటిస్తోంది. ప్రముఖ ఇరానియన్-ఫ్రెంచ్ ఫిలిం మేకర్ మార్జాన్ సత్రాపి ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అలెగ్జాండ్రా దద్డారియో మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ... ఇప్పుడు ఈ హాలీవుడ్ కల కి బ్రేక్ పడ్డట్టే కనిపిస్తోంది...

Dhanush Hollywood Movie director Satrapi Walked Away from the movie

'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్' పేరుతో ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ధనుష్ హీరోగా ఇంటర్నేషనల్ మూవీని కొన్ని నెలల కిందటే అనౌన్స్ చేసింది. ఇది ఒక ఫ్రెంచ్ రచయిత రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కాల్సిన సినిమా. ఈ సినిమాకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉంది. ఐతే ప్రి ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లుండి దీని దర్శకుడు మర్జానే సత్రాపి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని షాకిచ్చాడు.

కారణాలేంటో తెలియదు కానీ సత్రాపి ధనుష్ సినిమా నుంచి వైదొలిగాడు. ఐతే ఈ సినిమాను ఆపే ప్రసక్తే లేదంటోంది నిర్మాణ సంస్థ. స్క్రిప్టు పని పూర్తయిన నేపథ్యంలో మరో దర్శకుడితో ఈ సినిమా చేయాలని భావిస్తోంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదికి వెళ్లకపోవచ్చు.

English summary
due to an unfortunate turn of events Marjane Satrapi has walked out of the project "The Extraordinary Journey Of The Fakir" and the team is looking out for a replacement, which could cause a further delay in the start of the ambitious project. Uma Thurman and Alexandra Daddario had signed on to share the screen with Dhanush.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu