»   » ట్రైలర్‌ ఇంతలా కేక పెట్టిస్తోంది,సినిమా ఎలా ఉంటుందో (వీడియో)

ట్రైలర్‌ ఇంతలా కేక పెట్టిస్తోంది,సినిమా ఎలా ఉంటుందో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ధనుష్‌, కీర్తీసురేశ్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'తొందరి'. ఈ చిత్రాన్ని తెలుగులో 'రైల్‌' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతం అని మెచ్చుకుంటున్నారు. సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

ఇది రైలులో జరిగే ప్రేమకథా చిత్రం అన్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్ క్యాంటీన్‌బాయ్‌గా నటించారు. ఆ రైల్లో ప్రయాణిస్తున్న కీర్తీసురేశ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమ ఏ తీరం చేరిందన్నదే తొడరి చిత్ర ఇతివృత్తం. ఇది ధనుష్, ప్రభుసాల్మన్‌ల చిత్రం కనుక మంచి అంచనాలే నెలకొంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు.

దర్శకుడు మాట్లాడుతూ.. 'సినిమాకు భాష లేదు. నేను తీసిన 'ప్రేమఖైదీ', 'గజరాజు' తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాయి. 'రైల్‌' కూడా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది' అని అన్నారు. నిర్మాత ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ..ఈనెల 16న 'రైల్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.

Dhanush's Rail Telugu Movie Official Trailer

ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదిరెడ్డి, ఆదిత్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డి. ఇమ్మాన్‌ స్వరాలు అందించారు. కరుణాకర్‌, తంబి రామయ్య, రాధారవి, గణేశ్‌ వెంకట్రామన్‌, చిన్ని జయంత్‌, ఆర్‌వీ ఉదయకుమార్‌, పూజా ఝవేరీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో 'రైల్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

తంగమగన్ చిత్రం తరువాత ధనుష్ నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అయితే ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో తొడరి, కొడి చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వీటిలో ధనుష్ మొదట నటించింది తొడరి చిత్రంలో. అయితే గ్రాఫిక్స్, సీజీ కార్యక్రమాలు కారణంగా తొడరి చిత్ర నిర్మాణం కాస్త ఆలస్యమైందని సమాచారం. అయినా ముందు నటించడానికి అంగీకరించిన తొడరి చిత్రాన్నే ముందుగా విడుదల చేయాలని ధనుష్ వర్గం నిర్ణయించింది.

నటి కీర్తీసురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. ప్రభుసాల్మన్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. అయితే రజనీకాంత్ చిత్రం కబాలి విడుదల తరువాత తొడరి చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం.

English summary
Tamil hero Dhanush is coming up with Rail telugu movie which is the dubbed version of Thodari. Keerthy Suresh is playing the female lead. Here is the official trailer of Rail!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu