»   » 'రాన్‌జానా': బ్రాహ్మణ అబ్బాయి-ముస్లిం అమ్మాయి

'రాన్‌జానా': బ్రాహ్మణ అబ్బాయి-ముస్లిం అమ్మాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ధనుష్,సోనమ్ కపూర్ కాంబినేషన్ లో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ రూపొందించిన చిత్రం 'రాన్‌జానా'. ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రం ఓ బ్రాహ్మణ కుర్రవాడికి,ముస్లిమ్ అమ్మాయికి మధ్య ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంతో తనకు మంచి పేరు వచ్చి బ్రేక్ వస్తుందని చెప్తోంది సోనమ్ కపూర్.

చిత్రంలో తన పాత్ర గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ... తాజా చిత్రంలో జోయా హైదర్‌ అనే ముస్లిమ్‌ యువతి పాత్రలో నటించాను. ఇందులో మా నాన్న ఓ ప్రొఫెసర్‌. నేనంటే ఎంతో ప్రేమ. అందుకే నాకు పూర్తి స్వాతంత్య్రం ఇస్తారు. అయితే నేను ఓ బ్రాహ్మణ అబ్బాయితో ప్రేమలోపడతాను. ఆ తరవాత కథ ఎలా ముందుకు సాగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఎంతో బాగుంది'' అని చెప్పుకొచ్చింది.

'రాంజానా' చిత్రం హిందీలో, 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ ఈ రోజు తెరపైకి రానుంది. ధనుష్‌ తొలిసారిగా నటిస్తున్న హిందీ సినిమా 'రాంజానా'. క్రిష్కలుల్లా నిర్మిస్తున్నాడు. ఆనంద్‌ ఎల్‌రాయ్‌ (తను వెడ్స్ మను దర్సకుడు) తెరకెక్కించారు.

ధనుష్‌ మాట్లాడుతూ.. తనకు భాష ముఖ్యం కాదని, కథ నచ్చితే చాలని తెలిపాడు. బాలీవుడ్‌లో క్రమం తప్పక నటిస్తానని అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున కెరీర్‌ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆ మేరకు ప్రస్తుతం మరో హిందీ కథకు పచ్చజెండా ఊపాడు.

ఈ కొత్త చిత్రం కూడా 'రాంజానా' దర్శకుడు ఆనంద్‌ ఎల్‌రాయ్‌ నిర్దేశకత్వంలోనే రూపొందనుండటం విశేషం. కథ నచ్చటంతోనే మళ్లీ ఆయన చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని ధనుష్‌ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
In yet another unusual pairing in B-Town, director Aanand L Rai is bringing together the Bollywood fashion doll Sonam Kapoor with south star and ‘Kolaveri Di’ sensation Dhanush in his film Raanjhnaa. The title itself suggests that the film is going to be a romantic movie. Sonam Kapoor plays the role of a middle-class girl studying in Delhi’s Jawaharlal Nehru University (JNU). Dhanush reportedly plays a Brahmin boy from Varanasi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu