»   » మళ్ళీ నా..?? రజినీ కాంత్ తో ఆడుకుంటున్నారా?? కబాలి 2 గురించి ట్విట్టర్ లో

మళ్ళీ నా..?? రజినీ కాంత్ తో ఆడుకుంటున్నారా?? కబాలి 2 గురించి ట్విట్టర్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల కాలంలో మన దేశంలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమాల్లో 'కబాలి' ఒకటి. అలాగే అత్యంత నిరాశపరిచిన సినిమాల్లో ఒకటిగా కూడా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. తమిళంలో ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది కానీ... తెలుగులో మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. అయితే ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తారంటూ అప్పట్లో ఓ టాక్ వినిపించింది. 'కబాలి' నిర్మాత కలైపులి థాను స్వయంగా ఈ ప్రకటన కూడా చేశాడు.

కానీ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే ఇప్పుడు 'కబాలి' సీక్వెల్ మళ్లీ తెరపైకి వచ్చింది. తమిళ ఫిలిం ఛాంబర్‌లో నిర్మాత కలైపులి 'కబాలి-2' టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. దీంతో ఈ చిత్రం సీక్వెల్ పక్కా అని తేలిపోయింది. అయితే ఈ సినిమా ఎప్పుడుంటుందన్నదే క్లారిటీ లేదు. 'కబాలి' అభిమానులకు నిరాశ కలిగించినా... రజనీ మాత్రం డైరెక్టర్ రంజిత్ మీద నమ్మకం పెట్టాడు. ధనుష్ నిర్మాణంలో రంజిత్‌తో ఇంకో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది వేరే కథతో తెరకెక్కే సినిమా. ముంబయ్ నేపథ్యంలో సాగుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న రంజిత్... రజనీకాంత్ ప్రస్తుతం చేస్తున్న రోబో సీక్వెల్ '2.0' సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు.

బిలో యావరేజ్ :

బిలో యావరేజ్ :

కబాలి సినిమా నిర్మించిన నిర్మాతలకి పెట్టుబడి పోను ఎంత మిగిలిందో తెలీదు కానీ ఆ సినిమా దర్శకుడు పా.రంజిత్ కి మాత్రం రజినీకాంత్ తరవాతి సినిమా చేసే అవకాశం దక్కింది. తమిళ అభిమానులు, తమిళ సినీ ప్రేక్షకుల అభిప్రాయం ఏమో గానీ.... తెలుగులో మాత్రం రజనీకాంత్ 'కబాలి' చిత్రానికి బిలో యావరేజ్ మార్కులే పడ్డాయి. ఈ సినిమా చూసిన వారిలో ఎక్కువ మంది నుండి అసంతృప్తే వ్యక్తం అయింది. భారీ అంచనాలతో వచ్చిన 'కబాలి' అంచనాలను ఏమాత్రం అందుకోలేక చతికిలపడింది. అయితే కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను తన తాజా ప్రకటనలో 'కబాలి' సినిమాకు సీక్వెల్ కూడా తీయబోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయం విన్న వెంటనే సినీ వర్గాలు కాస్త హడలిపోయాయి.

 'కబాలి'కి సీక్వెల్ :

'కబాలి'కి సీక్వెల్ :

గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఇటీవల రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా సూపర్ హిట్టయిన సంగతి మనకు తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఆయన అల్లుడు ధనుశ్ 'కబాలి'కి సీక్వెల్ నిర్మించనున్నట్టు ఆమధ్య ప్రకటించాడు. దీనికి కథను కూడా దర్శకుడు రంజిత్ సిద్ధం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం 'కబాలి' చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత కలైపులి థాను 'కబాలి 2' టైటిల్ని రిజిస్టర్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ చిత్రాన్ని ధనుశ్ నిర్మిస్తారా? లేక థాను నిర్మిస్తారా? లేక థాను వేరొకరితో 'కబాలి 2' ప్లాన్ చేస్తున్నారా? అన్నది ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.

 రజినీకాంత్ అల్లుడు ధనుష్:

రజినీకాంత్ అల్లుడు ధనుష్:

రజినీకాంత్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరి కల. కాని ఆ కలని కొందరు మాత్రమే సాకారం చేసుకోగలుగుతారు. అతి తక్కువ టైంలో రంజిత్ ఆ గోల్డెన్స్ ఛాన్స్ అందుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కాని మరోసారి రజినీకాంత్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రంజిత్‌కి దక్కడం గొప్ప అదృష్టమే. అయితే ఈ విషయాన్ని రజినీకాంత్ అల్లుడు ధనుష్ తన అఫీషియల్ సైట్ ద్వారా వెల్లడించాడు. కబాలి సీక్వెల్ చిత్రాన్ని ఉండర్‌బార్ ఫిలింస్ పతాకంపై తనే నిర్మిస్తున్నట్టు వెల్లడించాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతూ ధనుష్ ఈ విషయాన్ని వెల్గడించాడు. తొలి సారి వీరిద్దరు కలిసి పని చేయనుండగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ మూవీ పట్టాలెక్కనున్నట్టు సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి :

స్క్రిప్ట్ వర్క్ పూర్తి :

రజనీకాంత్ ప్రస్తుతం 2.0 చిత్రంతో బిజీగా ఉండగా ఈ ఏడాది చివరి వరకు ఆ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఇక రంజిత్ కబాలి సీక్వెల్‌కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. రంజిత్ స్టార్ హీరోస్ సూర్య, విజయ్‌తో మూవీ చేయనున్నాడని ఆ మధ్య కోలీవుడ్‌లో ప్రచారం జరిగిన ధనుష్ ట్వీట్‌తో సూర్య, విజయ్‌ల ప్రాజెక్ట్‌లు వాస్తవ రూపం దాల్చవని అర్ధం అవుతుంది. కబాలి సినిమాకు కాస్త డివైడ్ టాక్ రాగా, సీక్వెల్‌లో అలాంటి పొరపాట్లేవి జరగకుండా ఈ సినిమాను రూపొందించాలని రంజిత్ మంచి కసితో ఉన్నట్టు తెలుస్తోంది.

 దారుణమైన ఫలితం:

దారుణమైన ఫలితం:

గత కొన్నేళ్ల వ్యవధిలో ఇండియాలో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘కబాలి' ఒకటి. అలాగే అత్యంత నిరాశ పరిచిన సినిమాల్లో ఒకటిగానూ దాన్ని చెప్పుకోవాలి. ఎన్నెన్నో ఆశలతో ఈ సినిమాకు వెళ్తే అక్కడ బొమ్మ ఇంకోలా కనిపించింది. నీరసించిన సూపర్ స్టార్ ను ప్రేక్షకులు చూడలేకపోయారు. తమిళంలో సినిమా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. తెలుగులో మాత్రం దారుణమైన ఫలితం వచ్చింది. ఐతే ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తారంటూ అప్పట్లో ఓ ప్రచారం నడిచింది. ‘కబాలి' ప్రొడ్యూసర్ కలైపులి థాను స్వయంగా ప్రకటన కూడా చేశాడు. కానీ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. అందరూ సైలెంటైపోయారు.

మళ్లీ తెరమీదికి:

మళ్లీ తెరమీదికి:

ఐతే ఇప్పుడు ‘కబాలి' సీక్వెల్ మళ్లీ తెరమీదికి వచ్చింది. తమిళ ఫిలిం ఛాంబర్లో నిర్మాత కలైపులి థాను ‘కబాలి-2' టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో ‘కబాలి' సీక్వెల్ పక్కా అని తేలిపోయింది. ఐతే ఆ సినిమా ఎప్పుడుంటుందన్నదే క్లారిటీ లేదు. ‘కబాలి' అభిమానులకు నిరాశ కలిగించినా.. రజినీ మాత్రం డైరెక్టర్ రంజిత్ మీద నమ్మకం పెట్టాడు.

 ప్రి ప్రొడక్షన్ వర్క్:

ప్రి ప్రొడక్షన్ వర్క్:

ధనుష్ నిర్మాణంలో రంజిత్ తో ఇంకో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇది వేరే కథతో తెరకెక్కే సినిమా. ముంబయి నేపథ్యంలో సాగుతుందట. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేస్తున్న రంజిత్.. వచ్చే ఏడాది రజినీ ‘2.0' నుంచి ఫ్రీ అయ్యాక ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు.

 సీక్వెల్ ఉంటుందా? :

సీక్వెల్ ఉంటుందా? :

కబాలి తన పాఠశాల పిల్లల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా ఆ పాఠశాలకు చెందిన ఇక విద్యార్థికి మలేషియా పోలీస్‌అధికారి ఒక తుపాకీ ఇచ్చి కబాలి వద్దకు పంపడం, అతను రాగానే స్క్రీన్ బ్లాక్ అవడం, ఈ తరువాత తుపాకీ పేలిన శబ్ధం రావడం చాలా సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. కాగా కబాలి చిత్రానికి సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్.ధాను తాను రెడీ అన్నట్టు వార్తలు రావటం తో అంతా అటువైపు చూస్తున్నారు.

ఏ అనుమానమూ లేనట్టే :

ఏ అనుమానమూ లేనట్టే :

విడుదల సమయంలో అందరి దృష్టిని మళ్లించిన ఈ చిత్రం సీక్వెల్‌కు రెడీ అవుతోంది ఇక ఈ విషయం లో ఏ అనుమానమూ లేనట్టే . ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్ల వరకు రాబట్టింది. ఇదిలా ఉండగా ‘కబాలి 2' చిత్రాన్ని రూపొందించనున్నట్లు గతంలోనే రంజిత్‌ తెలిపారు. ఇప్పడు అది ఆచరణకు వచ్చినట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ అల్లుడు, నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై నిర్మించనున్నారు.

మళ్లించిన

మళ్లించిన

దీనిపై ధనుష్‌ మాట్లాడుతూ తమ ప్రొడక్షన్‌లో తదుపరి చిత్రం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకోనుంది. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన చిన్నపాటి వీడియోను ధనుష్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఇది ‘కబాలి 2' లేదా కొత్త సినిమానా అనే అంశాన్ని స్పష్టం చేయలేదు.సీక్వెల్‌గానే ఉండొచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నా.. అదేం లేదు వేరే ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌.. శంకర్‌ దర్శకత్వంలో ‘2.ఓ'లో నటిస్తున్నారు. ఇది పూర్తికాగానే రంజిత్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు

English summary
Actor Dhanush's next production venture featuring superstar Rajinikanth will reportedly be a sequel to Tamil action-drama Kabali, according to a well-placed source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu