»   »  ధనుష్ వెబ్ సిరీస్: కోలీవుడ్ హాట్ టాపిక్ ఇదే

ధనుష్ వెబ్ సిరీస్: కోలీవుడ్ హాట్ టాపిక్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడిగానే కాదు దర్శక నిర్మాతగా ధనుష్ కి మంచి అనుభవముంది. అలాంటి ధనుష్ ఇప్పుడు వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే ఆయన వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేయాలనుకున్నాడట. అయితే అప్పుడున్న కమిట్మెంట్స్ వలన అది సాధ్యపడలేదు.

త్వరలో ఓ వెబ్ సిరీస్

త్వరలో ఓ వెబ్ సిరీస్

ఇప్పటికే హిందీ - తెలుగు వంటి సినీ పరిశ్రమల్లో ఓ మార్కెట్ ను తెచ్చుకున్న ధనుష్ ఇప్పుడు దాన్ని రెట్టింపు చేసేందుకు సిద్దపడుతున్నాడట. త్వరలో ఓ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ధనుష్ చెప్పేశాడు. అది కూడా ఆయన దర్శకత్వంలోనే ఉంటుందట. రెండేళ్ల క్రితమే వెబ్ సిరీస్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్న ధనుష్ వీఐపీ 2 షూటింగ్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదట.

Dhanush and Kajol's VIP 2 Release Postponed Reasons
గన్స్ అండ్ థైస్ అంటూ

గన్స్ అండ్ థైస్ అంటూ

సినిమానుంచి ఈ మధ్య వెబ్ సిరీస్ వైపు చూపు మళ్ళిస్తున్నారు దర్శకులూ నిర్మాతలూ అంతా. వచ్చే జనరేషన్ వెబ్ సిరీస్ లదే అనీ, తాను ఇక మీదట వరుసగా వెబ్ సిరీస్ లు తీయబోతున్నాను అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ "గన్స్ అండ్ థైస్ అంటూ" తన తొలి వెబ్ సిరీస్ ట్రైలర్ తోనే సంచలనం రేపాడు. ఇక ఇప్పుడు చాలామంది నటులూ దర్శకులూ వెబ్ సిరీస్ ల బాటపట్టారు. సో..! ధనుష్ కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

సౌత్ లో హల్‌చల్‌ మొదలైంది

సౌత్ లో హల్‌చల్‌ మొదలైంది

వెబ్‌సిరీస్‌ మరీ కొత్త ట్రెండేం కాదు. జోరందుకుంది మాత్రం ఇప్పుడే. పర్మనెంట్‌ రూమ్మేట్స్‌, లవ్‌ బైట్స్‌, గర్ల్‌ ఇన్‌ ద సిటీ, ఐషా... అంటూ ఉత్తరాదిని ఎప్పుడో వూపేశాయివి. సౌత్ లో ఈ హల్‌చల్‌ మొదలైంది మాత్రం ఏడాది కిందటే. అయినా మార్కెట్ బావుండటం, సినిమాలో ఉన్నట్టు సెన్సార్, రిలీజ్ సమస్యలు కూడా ఉండకపోవటం వంటి అడ్వాంటేజ్ లు చాలానే ఉన్నాయి

వచ్చే ఏడాది

వచ్చే ఏడాది

దీంతో వచ్చే ఏడాది తప్పకుండా వెబ్ సిరీస్ ను స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ధనుష్ రెండు నెలల క్రితం దర్శకత్వం వహించి రిలీజ్ చేసిన పా పాండి సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో వెబ్ సిరీస్ కథను రెడీ చేసుకొని మరి కొంత మంది రచయితల సహకారంతో మంచి కథనాన్ని డెవలప్ చేస్తున్నాడట. చూడాలి మరి వెబ్ సిరీస్ తో ఈ నటుడు ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో.. ఈ వెబ్ సిరీస్ లో ధనుష్ నటించడట .. దర్శకత్వం మాత్రమే చేస్తాడట.

English summary
Kollywood Actor and his team are now planning to venture into web series.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu