twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ వాయిస్ అంటేనే వణికి పోయారు, సంగీత ప్రియుల కు శుభవార్త: దించాక్ పూజ ని అరెస్ట్ చేస్తారా?

    దించాక్ పూజ ఈ పేరు వింటేనే ఈ మధ్య సంగీత ప్రియిలు భయపడి పోతున్నారు, కాస్త గుండె బలం ఉన్నవారైతే. ఆ పేరు వినిపిస్తే చాలు ఎదుటివారి చెంప వాయగొట్టటమో, లేదంటే బూతుపురాణం ఎత్తుకోవటమో చేస్తున్నారు.

    |

    దించాక్ పూజ ఈ పేరు వింటేనే ఈ మధ్య సంగీత ప్రియిలు భయపడి పోతున్నారు, కాస్త గుండె బలం ఉన్నవారైతే. ఆ పేరు వినిపిస్తే చాలు ఎదుటివారి చెంప వాయగొట్టటమో, లేదంటే బూతుపురాణం ఎత్తుకోవటమో చేస్తున్నారు. అంతగా ఏం చేసిందీ పిల్ల అని అడిగితే మాత్రం మీరింకా అమాయకుల జాబితా లో ఉన్నట్టే. గతకొంత కాలంగా సంగీత ప్రియుల మీద పగబట్టిందో అమ్మాయి. దించక్ పూజా పేరుతో ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి తనో పేద్ద పాప్ స్టార్ అన్నలెవెల్లో తను పాడిన పాటలని, తన వింత ఎక్స్ప్రెషన్లతో కలిపి అప్ లోడ్ చేసింది...

     దించాక్ పూజ బాదితులకు

    దించాక్ పూజ బాదితులకు

    మొదట్లో కాస్త కామెడీ అనుకున్న జనం నవ్వుకుంటూ బాగానే చూసారు గానీ తర్వాతే అర్థమయ్యింది అమ్మడు సీరియస్ గానే సింగర్ గా ట్రై చేస్తోందనీ, మరిన్ని వీడియోలు కూడా తమ మీద దాడి చేయటానికి సిద్దంగా ఉన్నాయని తెలిసి భయం తో బిక్క చచ్చి పోయారు. ఇంకా భయపడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దించాక్ పూజ బాదితులకు ఒక చల్లని వార్త అందింది... ఆమె రెన్డో వీడియోతోనే బుక్ అయ్యిందట...

    సెల్ఫీ మైనే లేలీ ఆజ్‌

    సెల్ఫీ మైనే లేలీ ఆజ్‌

    సోషల్‌ మీడియాలో ‘మ్యూజిక్‌ సెన్సేషన్‌'గా చెప్పుకొనే ఈమెకు చాలామంది అభిమానులే ఉన్నారు. ‘సెల్ఫీ మైనే లేలీ ఆజ్‌' అంటూ ఈ అమ్మాయి పెట్టిన వీడియో పాటను ఏకంగా కోటిన్నరమందికిపైగా చూశారు. ఇలా ఒకటి రెండు పాటలతో ఫేమస్‌ అయిన ఈ అమ్మాయి తాజాగా ‘దిలోంక షూటర్‌ హై మేరే స్కూటర్‌.. దిలోంక షూటర్‌' అంటూ మరో వీడియోపాటను తన యూట్యూబ్‌ పేజీలో పోస్టు చేసింది.

    దిలోంక షూటర్ హై మేరే స్కూటర్

    దిలోంక షూటర్ హై మేరే స్కూటర్

    స్కూటర్‌పై వెళ్తూ. "దిలోంక షూటర్ హై మేరే స్కూటర్.. దిలోంక షూటర్" అంటూ వీడియో పాట పాడింది. ముందులాగే వ్యూస్ వస్తాయి కదా అని ఆశించింది.. వ్యూస్ అయితే వచ్చాయి కానీ చిక్కులు మాత్ర తప్పలేదు. రెడ్ స్కూటర్ మీద.. రెడ్ డ్రస్ వేసుకున్న దించక్.. అటు ఇటూ తిరుగుతూ గట్టిగా పాట పాడుతూ ఉంటుంది..

    ట్విట్టర్‌లో ఫిర్యాదు

    ట్విట్టర్‌లో ఫిర్యాదు

    ఇలా రెండు నిమిషాలపాటు తిరుగతూ ఒకటి రెండు పదాలనే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాడాల్సిన హెల్మెట్ మాత్రం ధరించకుండానే ఉంది. దీంతో ఈ పాయింట్‌‌ను పట్టుకున్న ఓ నెటిజన్ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు.

    పెద్దగా పాడటం, హెల్మెట్ ధరించకపోవడం

    పెద్దగా పాడటం, హెల్మెట్ ధరించకపోవడం

    రోడ్లపై దించక్ పెద్దగా పాడటం, హెల్మెట్ ధరించకపోవడం ఇవన్నీ న్యూసెన్స్ కిందికి వస్తాయని తక్షణమే ఈమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి స్పందించిన ఢిల్లీ పోలీసులు ఎక్కడ.. ఎప్పుడు డించక్ పూజ బైక్ ను నడిపిందో చెప్పాలని అడిగారు.

    పూజపై చర్యలు తీసుకుంటామని

    దీనికి స్పందించిన అవతలి వ్యక్తి పక్కా సమాచారం అందించాడు. దీంతో త్వరలో డించక్ పూజపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే ఇక నెటిజన్ల ఆనందానికి అవదుల్లేవిప్పుడు. పాపం పూజ కీ కొందరు అభిమానులు ఉన్నారు గానీ వాళ్ళుకూడా ఆమె పక్షాన మాట్లాడటం లేదు.

    English summary
    After a man tweeted Delhi Traffic Police about Dhinchak Pooja riding her scooter without a helmet while singing loudly, the police assured him that action would be taken against her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X