twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిజినెస్ పార్ట్నర్లుగా నాగార్జున-క్రికెటర్ ధోని

    By Bojja Kumar
    |

    Mahendra Singh Dhoni-Nagarjuna
    న్యూఢిల్లీ: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, క్రికెటర్ ధోనీ బిజినెస్ పార్ట్నర్లు అయ్యారు. బైక్‌లంటే వల్లమాలిన వ్యామోహం కనబర్చే టీమిండియా కెప్టెన్ ధోనీ, రేసింగులంటే పడిచచ్చే సినీ నటుడు నాగార్జున ఇప్పుడు సంయుక్తంగా రేసింగ్ రంగంలకి దిగారు. వరల్డ్ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌లో ధోనీ- నాగార్జున టీమ్ పాల్గొననున్నాయి.

    వచ్చే ఏడాది ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. అంతకంటే ముందు దాని అనుబంధ రేస్ అయిన ఎఫ్ఐఎమ్ సూపర్‌స్పోర్ట్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మహీ-నాగార్జున సొంత జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు 'ఎమ్ఎస్‌డీ ఆర్-ఎన్ రేసింగ్ టీమ్ ఇండియా' అని నామకరణం చేశారు. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో మహీ-నాగ్ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఫ్లోరియన్ మరినో (ఫ్రాన్స్), డాన్ లిన్‌ఫుట్ (బ్రిటన్) ధోనీ-నాగ్ జట్టుకు రైడర్లు.

    ఓ మధ్యవర్తిద్వారా ధోనీకి, నాగార్జునకు లింకు కలిసినట్లు ప్రముఖ ఆంగ్లపత్రిక పేర్కొంది. ఈ క్రమంలో ఇద్దరూ ఈ బైక్ రేసింగ్ జట్టులో పార్ట్నర్లు అయినట్లు స్పష్టమవుతోంది. ధోనీ మేనేజర్ అరుణ్ పాండే ఈ రేసింగ్ జట్టుకు మేనేజింగ్ డైరెక్టర్ కాగా...నాగార్జున డైరెక్టర్‌గా ఉన్నారని సమాచారం.

    English summary
    Sharing the same passion for bikes and bike races, top Telugu film hero Nagarjuna and India Cricket Team Captain Dhoni have strike a business deal to start their own bike racing team for FIM Super Sport World Championship to begin next year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X