»   » రూ.500 కోట్ల కలెక్షన్స్: చరిత్ర సృష్టించిన ధూమ్-3

రూ.500 కోట్ల కలెక్షన్స్: చరిత్ర సృష్టించిన ధూమ్-3

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన ధూమ్ -3 చిత్రం కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈచిత్రం తాజాగా రూ. 500 కోట్ల కలెక్షన్ మార్కును అధిగమించింది. తద్వారా ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా 'ధూమ్-3' చిత్రం రికార్డులకెక్కింది.

బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించడంలో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు అమీర్ ఖాన్. ఆయన గత సినిమాలు గజని, 3 ఇడియట్ చిత్రాలు కూడా అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. 'గజిని' చిత్రం అప్పట్లో కేవలం 16 రోజుల్లో 114 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత '3 ఇడియట్స్' 16 రోజుల్లో 200 కోట్లు వసూలు చేసింది. తాజాగా ధూమ్-3 చిత్రం ఏకంగా 500 కోట్ల మార్కును అధిగమించింది.

ఇప్పటి వరకు 'ధూమ్-3' చిత్రం రూ. 501.35 కోట్లు($83.56 మిలయన్లు) వసూలు చేసింది. ఈ వసూళ్ల వివరాలను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. 'తమ ధూమ్-3 చిత్రం ఇండియన్, ఓవర్సీస్ బాక్సాసు వద్ద చరిత్ర సృష్టించిందని, ఇప్పటి వరకు మొత్తం రూ. 500 కోట్లు వసూలు చేసిందని వారు తమ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

500 కోట్లలో....ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 351.29 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 150.06 కోట్లు వసూలు చేసింది. ధూమ్-3 చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రదాన పాత్రల్లో నటించారు.

English summary
Aamir Khan has a magic wand - It's confirmed ! Everybody in B town is busting their brains figuring out what makes Aamir's ideas tick ! It is Aamir's film Ghajini that even brought the concept of '100 crore films' in Bollywood ! Then he opened Bollywood's account in 200 crore box office club with his critically acclaimed blockbuster 3 idiots. Now his latest flick Dhoom 3 has collected 500 crores till now ! Yes, he did it again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu