»   » అమీర్ ఖాన్ ‘ధూమ్-3’ ఫస్ట్ టీజర్ (వీడియో)

అమీర్ ఖాన్ ‘ధూమ్-3’ ఫస్ట్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రం ఫస్ట్ టీజర్ ఈ రోజు(సెప్టెంబర్ 5) రిలీజైంది. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం.

ఈసంవత్సరం ధూమ్-3తో అంతం అవుతుంది అంటూ ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేసారు. అంటే ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Dhoom 3 Teaser Promo Released

సినిమాను అంత లేటుగా విడుదల చేయడం అమీర్ ఖాన్‌కు బొత్తిగా ఇష్టం లేనట్లుంది. క్రిస్ మస్ ద్వారా వేచి చూసేందుకు మనసు ఒప్పుకోవడం లేదని సోషల్ నెట్వర్కింగులో పేర్కొన్నాడు. అన్ని మార్పులు, కూర్పులు చేసిన ధూమ్3 సినిమాను అమీర్ ఖాన్ వీక్షించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి సినిమా అద్భుతంగా వచ్చిందని స్పష్టం అవుతోంది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం.

చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆదిత్య చెప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
If you think you have had enough of the Chennai Express dose, here we bring something new and refreshing for you. Yes, we're sure you were waiting for this day desperately. The first teaser promo of superstar Aamir Khan's much-awaited movie Dhoom 3 is finally out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu