»   » ఇదేం దుర్మార్దం..వీళ్లసలు మనుష్యులేనా: యూట్యూబ్‌లో 'ధృవ' సినిమా పెట్టేసారు

ఇదేం దుర్మార్దం..వీళ్లసలు మనుష్యులేనా: యూట్యూబ్‌లో 'ధృవ' సినిమా పెట్టేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పైరసీ అనేది సినిమా పరిశ్రమకు శాపంలా తయారైంది. స్టార్ హీరోలు నటించిన కొత్త సినిమా కానీ లేదా పెద్ద హిట్టైన చిన్న సినిమాని కానీ పైరసీ దారులు బ్రతకనివ్వటం లేదు. ధియోటర్ లో రికార్డ్ చేసిన ప్రింట్స్ ని టోరెంట్స్ గా పెట్టేయటం జరుగుతోంది. అక్కడితో ఆగకుండా యూట్యూబ్ లో కూడా ఈ సినిమాని అప్ లోడ్ చేసేస్తున్నారు. ఇది తెలిసిన విషయమే కదా..ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా చెప్తున్నారు అంటే... ధృవ చిత్రాన్ని యూట్యూబ్ లో పెట్టడంటో మరోసారి మాట్లాడుకోవాల్సి వస్తోంది.

వివరాల్లోకి వెళితే... రామ్‌చరణ్ ధృవ సినిమా పాటిజివ్ టాక్ ఉన్నా మొదటి రోజు పెద్ద ఊపు లేదు. అయితే ఆ రోజు సాయింత్రం నుంచి టాక్ స్ప్రెడ్ అయ్యి...మెల్లిగా పికప్ అవ్వటం మొదలైంది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు.


Dhruva Movie Leaked Online Already!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల షేర్ సాధించింది. విడుదలయిన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22.5 కోట్ల రూపాయలు సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని పైరసీ భూతం చంపేస్తోంది.


గత రాత్రి యూట్యూబ్‌లో గుర్తుతెలియని పైరసీ నేరగాళ్లు ధృవ సినిమాను పోస్ట్ చేశారు. ఈ పరిణామంతో మెగా ఫ్యాన్స్ కంగుతిన్నారు. వెంటనే యాంటీ పైరసీ టీంతో మాట్లాడి ధృవ పైరసీని తొలగించారు. రెండు సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రామ్ చరణ్ కు ఇప్పుడు పరిస్దితి మారి కలెక్షన్స్ వస్తున్న సమయంలో ఇలా జరిగటం మెగా ఫ్యాన్స్ కు అసహనాన్ని కలిగ చేస్తోంది.


Dhruva Movie Leaked Online Already!

పైరసీని ప్రోత్సహించొద్దని ఎంతలా రిక్వెస్ట్ లు చేస్తున్నా కొందరు మాత్రం ఈ పైరసీ సినిమాలతో వ్యాపారం చేసి కోట్లు దండుకునే పనిలో ఉంటున్నారు. సినిమా విడుదలకు ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విడుదలయ్యాక మాత్రం ఈ పైరసీని నియంత్రిచడంలో సినీ ప్రముఖులు విఫలమవటం విషాదం.


ధృవ పైరసీ ప్రింట్స్ ఎక్కడన్నా కనపడితే...వెంటనే ఈ క్రింద ఈమెయిల్ ఎడ్రస్ కు ఆ లింక్ లు మెయిల్ చేయండి.


Cyber@apfilmchamber.com & Antipiracy@Geethaarts.com.

English summary
The piracy print of the movie which is already available on Torrents suddenly made its entry onto Youtube last night. As soon as it is live, there are several 100s of views and many have even downloaded it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu