»   » నోట్ల రద్దుకు భయపడేది లేదంటూ.... డిసెంబర్ 9న ఫిక్సైన రామ్ చరణ్!

నోట్ల రద్దుకు భయపడేది లేదంటూ.... డిసెంబర్ 9న ఫిక్సైన రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్లు రద్దవ్వడంతో ప్రతి పౌరుడిపైనా ఆ ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా వ్యాపార రంగం చిన్నబోయింది. సినిమా పరిశ్రమపై కూడా రూ. 1000, రూ. 500 నోట్ల ప్రభావం భారీగానే పడింది.

ఈ వ్యవహారంతో చాలా సినిమాలు విడుదల వాయిదాపడింది. తెలుగులో కూడా పలువురు నిర్మాతలు ఈ పరస్థితుల్లో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఇష్టపడటం లేదు. రామ్ చరణ్ 'ధృవ' మూవీ కూడా వాయిదా పడుతుందనే ప్రచారం జరిగింది.

అయితే రామ్ చరణ్ ఈ నోట్ల రద్దు వ్యవహారానికి ఏ మాత్ర భయపడట లేదు. డిసెంబర్ 9న తమ సినిమాను విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యాడు.

ధృవ

ధృవ

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ `ధృవ‌`.

ఆడియోకు మంచి రెస్పాన్స్

ఆడియోకు మంచి రెస్పాన్స్

హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా పాటలు ఇటీవ‌ల ఆదిత్య మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుద‌లై ఆడియెన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.

రామ్ చరణ్

రామ్ చరణ్

ఈ చిత్రంలో మెగాప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ ఐ.పి.య‌స్ ఆఫీస‌ర్ ధృవ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు

నటీనటులు

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Ram Charan upcoming movie Dhruva releasing on Dec 09. Dhruva is an upcoming Indian Telugu-language film directed by Surender Reddy and produced by Allu Aravind under his banner Geetha Arts. It features Ram Charan, Rakul Preet Singh. The film is a remake of the 2015 Tamil-language film Thani Oruvan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu