»   » ‘ధృవ’ థియేట్రికల్ ట్రైలర్... సూపర్ (వీడియో)

‘ధృవ’ థియేట్రికల్ ట్రైలర్... సూపర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ‌. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ స‌భ్యులు యు/ఎ స‌ర్టిఫికెట్‌ను ఇచ్చారు. సినిమా ప్రారంభం నుండి సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

rn

ట్రైలర్ ఇదే..

ధృవ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ముందే ప్రకటించడంతో..... మెగా అభిమానులంతా శుక్రవారం సాయంత్ర 7 గంటలకు... ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా సిద్ధమయ్యారు.

తొలుత సాంకేతిక సమస్య

తొలుత సాంకేతిక సమస్య

సరిగ్గా 7 గంటలకు ట్రైలర్ లింక్ ధృవ సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసారు. అయితే తొలుత ట్రైలర్ ప్లే కాలేదు. ట్రైలర్ ప్లే కావడం లేదు, ప్రైవేట్ వీడియో అని వస్తోంది...అంటూ క్షణాల్లో వందల సంఖ్యలో కామెంట్స్ పోస్ట్ చేసారు అభిమానులు. వెంటనే లోపాన్ని సవరించారు.

అరగంటలో 50వేల హిట్స్

అరగంటలో 50వేల హిట్స్

ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ట్రైలర్ చూసేందుకు వేలాది మంది.... మెగా అభిమానులు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాపుల ముందు వాలిపోయినట్లు స్పష్టం అవుతోంది. ట్రైలర్ విడుదలైన అరగంటలో దాదాపు 50వేలకు పైగా హిట్స్ వచ్చాయి.

తారాగణం

తారాగణం

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

English summary
Dhruva Theatrical Trailer super
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu