»   » మరోసారి మెగా పవర్ ఏమిటో ఋజువయ్యింది.... ధృవ సంచలనం, నవదీప్ ఇలా

మరోసారి మెగా పవర్ ఏమిటో ఋజువయ్యింది.... ధృవ సంచలనం, నవదీప్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సత్తా మరోసారి ప్రూవ్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నటించిన 'ధృవ' చిత్రం ట్రైలర్ దుమ్మురేపుతోంది. వారం క్రితం విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికి 51 లక్షలకు పైగా హిట్స్ సొంతం చేసుకుని రికార్డు కొడుతోంది. ఇంత తక్కువ స్పాన్ లో ఇన్ని హిట్స్ పొందడం అనేది తెలుగు సినిమా వరకు ఒక సంచలనమే అని అంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో వున్న అంచనాలకు ఇదొక నిదర్శనంగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా వరుస ఫ్లాపులతో చతికలబడ్డ రామ్ చరణ్ తన తాజా చిత్రంతో భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

ఇప్పుడు ఈ హీరో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న థియేటర్లలోకి రానుండగా, డిసెంబర్ 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపుకోనుంది. అయితే ఇటీవల ధృవ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ కి 5 మిలియన్ల వ్యూస్ రాగా, ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా ఈ రేంజ్ ఫీట్ సాధించలేదని చెబుతున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ఇది మరెంత సంచలనం సృష్టిస్తుందన్నది వేచిచూడాలి!


మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ధృవ. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించేస్తోంది. హై స్పీడ్ కదిలిపోతున్న విజువల్స్ అందరికీ తెగ నచ్చేసింది కూడా. ఇటీవల ధృవ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ యూ ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ కి 5 మిలియన్ల వ్యూస్ రాగా, ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా ఈ రేంజ్ ఫీట్ సాధించలేదని చెబుతున్నారు. స్టన్నింగ్ విజువల్స్ తో పాటు రామ్ చరణ్ స్టైలిష్ లుక్, సురేందర్ రెడ్డి టేకింగ్, హిప్ హాప్ తమీజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ధృవ చిత్ర ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి. ఇక చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రేపు జరుపుకోనున్నారు..డిసెంబర్ 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపుకోనుంది.ధ్రువ లో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా, అరవింద్ స్వామి విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు..


Dhruva trailer crosses 5 million views

అయితే.. ఈ ట్రైలర్ లో ఎక్కువ ఫ్రేమ్స్ లోనే ఉన్నా.. అంత స్పష్టంగా కనిపించని కేరక్టర్ కుర్ర హీరో నవదీప్ చేశాడు. చరణ్ కి తోడుండే నలుగురు ఐపీఎస్ లలో ఒకడిగా ధృవలో కనిపిస్తాడు. ఈ చిత్రం హీరో-విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ అని.. ఆ కాన్సెప్ట్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అనే సంగతి ముందు నుంచే తెలుసు. ఇలా విలన్ వేసిన ఉచ్చులో ఇరుక్కుపోయే పాత్ర నవదీప్ ది. చరణ్ కి తెలిసినా కాపాడలేకపోతాడు. విలన్స్ నవదీప్ ని ఎలా హింసలు పెడతారో ట్రైలర్ లో చూపించారు కూడా.


సినిమా మొత్తానికి ఆయువుపట్టుగా నిలిచే ఈ ఎపిసోడ్ లో.. నవదీప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ధృవ తర్వాత నవదీప్ రోల్ కి విపరీతంగా పేరు రావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇక ధృవ టైటిల్ లో చూపిస్తున్న నెంబర్ 8కి సంబంధిచిన సీక్రెట్ కూడా ఈ ఎపిసోడ్ కే లింక్ అయి ఉంటుందట. అసలా సీక్రెట్ కి మూలమే నవదీప్ అంటున్నారు. నవదీప్ చాలా రోజుల తర్వాత అదిరిపోయే కేరక్టర్ పడిందని చెప్పచ్చు.

English summary
It seems that there is no stoppage for Dhruva! Before the release, the upcoming actioner drama, Dhruva is creating records and winning the hearts of movie lovers. The recently released trailer has got a whooping 5 million views with 69K likes in just 7 days on YouTub.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu