»   »  రాజమౌళి కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్

రాజమౌళి కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

 విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సాధించి సత్తా చాటింది రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డిల 'ధృవ' ట్రైలర్‌. అందులో వింతేముంది అంటారా...ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఈ ట్రైలర్‌ తెగనచ్చేసిందట. తన ట్విట్టర్‌ పేజీలో 'ధృవ' ట్రైలర్‌ లింక్‌ను అప్‌లోడ్‌ చేసిన రాజమౌళి చరణ్‌ను, సురేందర్‌ రెడ్డిని అభినందించారు.

'చాలా స్టైలిష్, ఎంతో ప్రామిసింగ్, సురేందర్ రెడ్డి, చరణ్ లకు అభినందనలు. అంచనాలకు మించి ఉంది ట్రైలర్, నిజానికి రీమేక్ సినిమాలు చేయటం చాలా కష్టం' అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒరిజినల్ వర్షన్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ధృవ డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

English summary
Maverick director SS Rajamouli too seemed to be caught up in the craze of Dhruva as he took to Twitter to not just his lend his support to the movie but also shower praises on the trailer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu