»   » బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి : ప్రకటించిన హీరోయిన్

బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి : ప్రకటించిన హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ హీరోయిన్, హైదరాబాదీ భామ దియా మీర్జా వచ్చే ఏడు తన బాయ్ ఫ్రెండుతో పెళ్లికి సిద్ధమవుతోంది. ఇతర బాలీవుడ్ తారల్లా దాగుడు మూతలు ఆడకుండా బాయ్ ఫ్రెండ్ విషయం, పెళ్లి విషయాన్ని నిర్మొహమాటంగా మీడియా ముందు ప్రకటించింది.

గత కొంత కాలంగా దియా మీర్జా బిజినెస్ మేన్ సాహిల్ సంఘాతో డేటింగ్ చేస్తోంది. తాము ఇద్దరం వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు దియా మీర్జా స్పష్టం చేసింది. దియా, సాహిల్ సంఘా కలిసి 'బార్న్ ఫ్రీ ఎంటర్టెన్మెంట్స్' అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఆమె మాట్లాడుతూ..గాడ్‌ఫాదర్‌ లేకుండా..ఇన్నేళ్లుగా నటిగా కొనసాగటానికి ఎంతో ఒపిక, పరిశ్రమ కావాలి. పరాజయాలు, విజయాలు రెండూ ఉంటాయి. మొదటి నుంచీ నేను తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే నటిగా కొనసాగాను. వాటి పట్ల ఎలాంటి విచారం లేదు. బాధ లేదు. ఇతరుల నుంచి నేను గౌరవంతో కూడిన చూపులనే కోరుకుంటాను. నేను ఇతరుల మధ్య కనబడగానే వారు కళ్లల్లో ప్రేమతో కూడిన పలకరింపు చూస్తే...అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

తప్పకుండా తెలుగులో ఓ సినిమా చేస్తాను. సినిమాలో నటిస్తానా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. కానీ సినిమా మాత్రం తీస్తాను. వచ్చే సంవత్సరం సాహిల్‌ సంఘాతో నా వివాహం జరగనుంది. మేమిద్దరం ప్రస్తుతం పూర్తిచేయాల్సిన కొన్ని సినిమాలున్నాయన్నారు.

English summary
Unlike other star couples, actress Dia Mirza is in no mood to play the hide and seek game with her fans and the media. The actress, who is dating businessman Sahil Sangha for quite a long time now, has announced her marriage, which is scheduled for next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu