Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'లవ్ సెక్స్ ఔర్ దోఖా' దర్శకుడు నెక్ట్స్ చిత్రం డిటేల్స్...
'ఖోస్లా కా ఘోస్లా', 'ఓయే లక్కీ లక్కీ ఓయే', 'లవ్ సెక్స్ ఔర్ దోఖా' అంటూ ప్రయోగాత్మక శైలిలో కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలు రూపొందిస్తున్న దర్శకుడు దివాకర్ బెనర్జీ. ఆయన తన నాలుగో చిత్రం 'షాంఘై' గురించి ముంబయిలో ప్రకటించారు. పీవీఆర్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం రాజకీయ నేపథ్యమున్న కథతో దీన్ని రూపొందబోతోంది. అభయ్ డియోల్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో మిగతా స్టార్ కాస్టింగ్ ఇంకా ఎంపిక చేయలేదు. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ "రాజకీయ అంశాలతో ముడిపడ్డ కథలు ఇప్పటికే చాలా వచ్చాయని అందరూ అంటున్నారు. కానీ నేను వారితో ఏకీభవించను. ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక రకంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నాను.
అంతేగాక ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదు. కానీ నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నాం. పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. ఇంకో విషయం చెప్పాలి...ఇంతవరకూ నా సినిమాల్లో అత్యధిక బడ్జెట్‌తో తీయబోతున్న చిత్రమిది. అలాగని భారీ బడ్జెట్ సినిమా అనుకోకండి. ఈ చిత్రం బడ్జెట్ కేవలం 12 కోట్లు మాత్రమే. అలాగే ఈ చిత్రం టైటల్ ని చూసి షాంఘైలో జరుగుతోందనుకోవద్దు. అసలు మేం షూటింగ్ కోసం చైనాలో అడుగు పెట్టం. ఇక ఈ బడ్జెట్ చూసి మిగిలిన వాళ్లకు ఇది చిన్న సినిమాలాగే ఉండొచ్చు. కానీ కథ పరంగా ఇది పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోదని అన్నారు. ఇక ఈ చిత్రం 1960ల్లో ప్రచురితమైన ఓ యూరోపియన్ నవల ఆధారంగా రూపొందనుందని అంతటా వినపిస్తోంది.