»   » డిల్లి మెట్రో ట్రైన్ లో... హీరోయిన్ తో బాలయ్య (ఫొటో)

డిల్లి మెట్రో ట్రైన్ లో... హీరోయిన్ తో బాలయ్య (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. ప్రస్తుతం 'డిక్టేటర్‌' షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ లో భాగంగా ఆయన మెట్రో ట్రైన్ ఎక్కారు. ఆ ఫొటో ని చిత్ర యూనిట్ ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఇక్కడ చూడండి.

Here is a pic of Dictator Balayya taking a ride in Delhi Metro#NandamuriBalakrishna #Anjali

Posted by Dictator on 3 December 2015

నందమూరి బాలకృష్ణ, అంజలి నటిస్తున్న కొత్త చిత్రం ' 'డిక్టేటర్‌'‌'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఆడియోని రెడీ చేసి, డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు.
Dictator Balayya taking a ride in Delhi Metro

ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం. అక్కడే ఐటమ్ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ మూడో తేదీ వరకు 'డిక్టేటర్‌' షూటింగ్ దేశరాజధానిలోనే సాగనుంది.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Here is a pic of Dictator Balayya taking a ride in Delhi Metro
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu