»   » ‘డిక్టేటర్’ బయ్యర్లకు 15 శాతం డిస్కౌంట్

‘డిక్టేటర్’ బయ్యర్లకు 15 శాతం డిస్కౌంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందిన చిత్రం డిక్టేటర్. అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 14న విడుదలవుతుంది.

సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు, కో ప్రొడ్యూసర్ శ్రీవాస్, ఈరోస్ ప్రతినిధులు చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తో చర్చలు జరిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి విడుదల చేయడానికి, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా వీరికి 15శాతం డిస్కౌంటును ఇవ్వాలని నిర్ణయించారు.


Dictator makers give a hefty discount

ఈ 15శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరికీ సుమారు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల వరకు మేలు జరుగుతుంది. ఈ మంచి నిర్ణయాన్ని డిక్టేటర్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరి స్వాగతిస్తూ నిర్మాతలకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
The makers of Dictator have had a long discussion about the buyer’s and the distributors’ trouble when it comes to releasing the movie across Andhra and Telangana, especially during this Sankranthi festive season. Director Sriwass, co-producers, Eros International, and Balakrishna, have decided to give all the buyers a hefty discount of 15%, but on the condition that the discount rates will not be further slashed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu